చైనా సైనికుడిని అప్పగించిన ఇండియన్ ఆర్మీ

లడాఖ్ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా సైనికుడు వాంగ్  ని భారత సైన్యం చైనాకు అప్పగించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక  చైనా అధికారులకు అప్పగించినట్టు సైన్యం తెలియజేసింది.

చైనా సైనికుడిని అప్పగించిన ఇండియన్ ఆర్మీ

Edited By:

Updated on: Oct 21, 2020 | 10:35 AM

లడాఖ్ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా సైనికుడు వాంగ్  ని భారత సైన్యం చైనాకు అప్పగించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక  చైనా అధికారులకు అప్పగించినట్టు సైన్యం తెలియజేసింది. తమ సోల్జర్ జాడ తెలియడంలేదని చైనా పీపుల్స్ ఆర్మీ భారత సైన్యానికి సమాచారం పంపిందని, దాంతో ఇతని ఆచూకీ తమకు లభ్యమైందని, త్వరలో అప్పగిస్తామని భారత సైనికాధికారులు తెలిపారు. ఇతడిని అప్పగించడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చునని  మంగళవారం వార్తలు వచ్చాయి.  అయితే ఎక్కువ సమయం తీసుకోకుండా చైనాకు అప్పగించేశారు. దీనిపై చైనా సంతృప్తి వ్యక్తం చేసింది.