Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్ భారత్ లేదా బంగ్లాదేశ్‌లో పుట్టి ఉండవచ్చు, చైనా శాస్త్రవేత్తల సంచలన ఆరోపణ

కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే అని ప్రపంచంలోని చాలా దేశాలు నమ్ముతున్నాయి. అగ్రదేశ అధినేత ట్రంప్ అయితే కరోనా వైరస్‌ను  చైనీస్ వైరస్‌ అని పిలిచేవారు.

కరోనా వైరస్ భారత్ లేదా బంగ్లాదేశ్‌లో పుట్టి ఉండవచ్చు, చైనా శాస్త్రవేత్తల సంచలన ఆరోపణ
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 28, 2020 | 11:16 AM

కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే అని ప్రపంచంలోని చాలా దేశాలు నమ్ముతున్నాయి. అగ్రదేశ అధినేత ట్రంప్ అయితే కరోనా వైరస్‌ను  చైనీస్ వైరస్‌ అని పిలిచేవారు. అయితే చైనా తన మీదన్న మరకను కప్పిపుచ్చుకనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మహమ్మారి వైరస్ భారత్ లేదా బంగ్లాదేశ్‌లో పుట్టి ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు సంచలన వ్యాఖ్యలు చేశారు. షాంఘై ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు రాసిన ఒక ఆర్టికల్ ప్రకారం, గత ఏడాది డిసెంబర్‌లో వుహాన్‌లో వైరస్ వ్యాప్తికి ముందే భారత ఉపఖండంలో సదరు వైరస్ ఉనికిలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ వివాదస్పదమవుతోంది. 

చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తల బృందం మాట్లాడుతూ కరోనా వైరస్ బహుశా 2019 వేసవిలో భారతదేశంలో ఉద్భవించిందని చెప్పుకొచ్చారు. జంతువుల నుంచి కలుషితమైన నీటి ద్వారా కరోనా వైరస్ మానవులలోకి ప్రవేశించిందని చైనా బృందం పేర్కొంది.  కరోనా వైరస్ యొక్క మూలాన్ని గుర్తించడానికి చైనా బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను (కరోనా వైరస్ ఎలా పరివర్తనం చెందిందనే దానిపై అధ్యయనం) చేస్తోంది. అయితే ఇతర నిపుణులు ఈ వాదనలపై సందేహాన్ని వ్యక్తం చేశారు. సదరు ఆర్టికల్‌ను లోపభూయిష్టమయినదిగా అభివర్ణించారు. 

విభిన్న ఉత్పరివర్తనాల ద్వారా వైరస్ యొక్క మూలాన్ని గుర్తించే ప్రయత్నంలో ఈ బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేసింది. అతి తక్కువ ఉత్పరివర్తనాలతో ఉన్న జాతి అసలుదని వారు వాదించారు. దీన్ని ప్రమాణంగా చూపుతూ, పరిశోధకులు మొదటి కేసులు వుహాన్‌లో నమోదవ్వలేదని వాదిస్తున్నారు. అందుకు బదులుగా భారతదేశం, బంగ్లాదేశ్ వైపు వేలు చూపిస్తున్నారు. ఎందుకంటే తక్కువ మ్యుటేషన్లతో వైరస్ జాతులు ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చెందాయన్నది వారి వాదన. 2019లో  మే నుంచి జూన్ వరకు, ఉత్తర-మధ్య భారతదేశంలో రెండవ పొడవైన ఉష్ణ తరంగం వ్యాపించిందని,  ఆ సమయంలో  తీవ్రమైన నీటి సంక్షోభం కారణంగా మనుషులు, జంతువులు ఒకే  నీటిని తాగడం వల్లే ఈ వైరస్ ప్రభలిందని వారు చెప్తున్నారు.

వైరస్ ఎక్కడ మొదలైందో ఆరోపించడానికి చైనా అధికారులు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో యుఎస్, ఇటలీలను మొదటి కోవిడ్ -19 కేసులు నమోదైనట్లు వారు వాదించారు.

Also Read :

హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి బస్సులో మంటలు.. ముగ్గురు దుర్మరణం

 శ్రీవారి భక్తులకు శుభవార్త, వర్చువల్ సేవా టికెట్లు విడుదల, రోజుకు ఎన్నో తెలుసా..?