‘ఈ పాపం మీదంటే మీదే !’ కరోనాపై చైనా, అమెరికా ‘కయ్యం’ ! .

అసలు కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది ? దీనిపై అమెరికా, చైనా మధ్య 'కయ్యం' మొదలైంది. ఈ వైరస్ పై  'కుట్ర'థియరీలను చైనా వ్యాప్తి చెందింపజేస్తుండగా.. అమెరికా వీటిని తిప్పికొడుతోంది.

'ఈ పాపం మీదంటే మీదే !' కరోనాపై చైనా, అమెరికా 'కయ్యం' ! .
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 14, 2020 | 3:10 PM

అసలు కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది ? దీనిపై అమెరికా, చైనా మధ్య ‘కయ్యం’ మొదలైంది. ఈ వైరస్ పై  ‘కుట్ర’థియరీలను చైనా వ్యాప్తి చెందింపజేస్తుండగా.. అమెరికా వీటిని తిప్పికొడుతోంది.  చైనాలో కరోనా మరణాలు తగ్గుతుండడం, ఇతర ప్రపంచ దేశాల్లో ఇది ప్రబలమవుతుండడం కూడా ఇందుకు కారణమవుతోంది. తమ దేశంలోని వూహాన్ సిటీలో ఈ వైరస్ పుట్టిందన్న అమెరికా వాదనను చైనా తిరస్కరిస్తోంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్.. గురువారం తన ట్విట్టర్లో.. అమెరికా సైన్యమే దీన్ని వూహాన్ నగరానికి చేరవేసిందని ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించిన షికాగో ప్రొఫెసర్ ఒకరు.. బహుశా ఝావో అధికారికంగానే ఈ ప్రకటన చేసినట్టు కనిపిస్తోందన్నారు.

తమ దేశానికి కరోనా ను లింక్ చేస్తూ చైనా వాడిన భాష పట్ల అమెరికా తీవ్రంగా ఖండించింది. అసలిది ‘వూహాన్ వైరస్’  అని విదేశాంగ  మంత్రి  మైక్ పాంపియో అభివర్ణించగా.. అధ్యక్షుడు ట్రంప్…  టీవీ ద్వారా తమ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో.. చైనాలోనే ఈ వ్యాధి మొదట పుట్టి వ్యాపించిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణ పూర్తిగా ఖండించదగినదని, బాధ్యతారాహిత్యమైనదని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పేర్కొన్నారు. ఈ వైరస్ ఎక్కడ ప్రారంభమైందన్న దానిపై ప్రజల్లో అనుమాన బీజాలు నాటడం ద్వారా  అమెరికా మా దేశం మీద బురద జల్లుతోందని ఆయన ప్రత్యారోపణ చేశారు.అటు-వూహాన్ మార్కెట్లోని ఓ జంతువు నుంచి మానవులకు ఇది వ్యాపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.