కరోనా ఎఫెక్ట్.. ఆ ఫ్రూట్‌కు పెరుగుతోన్న భారీ డిమాండ్..!
కరోనా ప్రభావం ఆహార అలవాట్లపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో మాంసాహారాన్ని తగ్గించేస్తున్నారు ప్రజలు. అయితే బిర్యానీని తినడం ఆపలేకపోతున్న కొందరు అందులో మాంసానికి
కరోనా ప్రభావం ఆహార అలవాట్లపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో మాంసాహారాన్ని తగ్గించేస్తున్నారు ప్రజలు. అయితే బిర్యానీని తినడం ఆపలేకపోతున్న కొందరు అందులో మాంసానికి బదులుగా ప్రత్యామ్నాయంగా పనసను ఎంచుకుంటున్నారు ప్రజలు. దీంతో పనసకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో పనస రేట్లకు కూడా రెక్కలొచ్చాయి.
మొన్నటివరకు కిలో పనస రూ.50 ఉండగా.. అది కాస్త ప్రస్తుతం రూ.120కు ఎగబాగింది. దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి వేగవంతం అవుతోన్న నేపథ్యంలో.. చికెన్, మటన్‌ల బదులు జాక్ ఫ్రూట్(పనస) తినడం మంచిదని కొందరు చెబుతున్నారు. కాగా మాంసాహారం తింటే కరోనా వ్యాప్తి చెందదని డాక్టర్లు చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం అనుమానం వీడటం లేదు. దీంతో చికెన్, మటన్ రేట్లు భారీగా పడిపోయాయి.
Read this Story Also: కోడిపై కరోనా దెబ్బ..రూపాయికే కమ్మనైన చికెన్ బిర్యానీ