చైనా దూకుడుపై.. భారత్ స్పందన భేష్: పాంపియో

గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. భారత్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. చైనా వస్తువుల బహిష్కరణ, 59 చైనా యాప్స్ పై నిషేధం, చైనా కాంట్రాక్టుల రద్దు ముఖ్యమైనవి. కాగా.. చైనా దూకుడు చర్యల పట్ల భారతీయులు

చైనా దూకుడుపై.. భారత్ స్పందన భేష్: పాంపియో
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 4:44 AM

గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. భారత్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. చైనా వస్తువుల బహిష్కరణ, 59 చైనా యాప్స్ పై నిషేధం, చైనా కాంట్రాక్టుల రద్దు ముఖ్యమైనవి. కాగా.. చైనా దూకుడు చర్యల పట్ల భారతీయులు చాలా బాగా స్పందించారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్నారు. చైనా దూకుడు చర్యలకు సంబంధించి అనేకసార్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో మాట్లాడానని తెలిపారు. కాగా, తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌ సర్ఫింగ్స్ నుంచి చైనా తన బలగాలను వెనక్కి తీసుకునే ప్రక్రియను దాదాపు పూర్తి చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

గాల్వాన్‌లో భారత్ దీటుగా బదులిచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కితాబిచ్చారు. డ్రాగన్‌ దేశం త్వరలోనే ఒంటరి అవుతుందని పేర్కొన్నారు. షీ జిన్‌పింగ్ పార్టీ నుంచి పొంచి ఉన్న ముప్పును ప్రపంచం అర్థం చేసుకుంటుందని తనకు గట్టి నమ్మకం ఉందని పాంపియో అన్నారు. అలానే చైనా చర్యలకు సరైన రీతిలో స్పందించేందుకు అన్ని దేశాలూ కలిసి వస్తాయని భావిస్తున్నట్లు పాంపియో తెలిపారు.