మరో రెండు నెలల్లో చైనా కరోనా వైరస్ వ్యాక్సీన్లు రెడీ ?

చైనాలో డెవలప్ అవుతున్న కరోనా వైరస్ వ్యాక్సీన్లు నవంబరు నాటికి సిధ్ధం కావచ్ఛునని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం 4 కోవిడ్ వ్యాక్సీన్లు క్లినికల్ ట్రయల్స్..

మరో రెండు నెలల్లో చైనా కరోనా వైరస్ వ్యాక్సీన్లు రెడీ ?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 15, 2020 | 2:02 PM

చైనాలో డెవలప్ అవుతున్న కరోనా వైరస్ వ్యాక్సీన్లు నవంబరు నాటికి సిధ్ధం కావచ్ఛునని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం 4 కోవిడ్ వ్యాక్సీన్లు క్లినికల్ ట్రయల్స్ తుది దశలో ఉన్నాయని, వీటిలో కనీసం మూడు  వ్యాక్సీన్లను అత్యవసర వినియోగ కార్యక్రమం కింద ఇప్పటికే కొంతమంది  వలంటీర్లకు ఇచ్చారని ఈ సంస్థ చీఫ్ గుజేన్ వూ తెలిపారు. మూడో దశ ట్రయల్స్ సజావుగా సాగుతున్నాయని, పబ్లిక్ కి ఇవి నవంబరు  లేదా డిసెంబరు నాటికి అందుబాటులోకి రావచ్ఛునని ఆమె చెప్పారు. మొదట వీటిలో ఓ వ్యాక్సీన్ ని తానే  గత ఏప్రిల్ లో తీసుకున్నానని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఆమె పేర్కొన్నారు. తమ దేశంలోని సైనోఫామ్, సినోవాక్ బయోటెక్ కంపెనీలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయన్నారు.