అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా యూఎస్‌లో ఓ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ విజృంభిస్తోందని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు.

  • Publish Date - 2:17 pm, Tue, 15 September 20
అమెరికాను వణికిస్తున్న కొత్త రకం 'బ్యాక్టీరియా'.!

Flesh-eating bacteria: కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. అక్కడ ఇప్పటివరకు 6,749,289 పాజిటివ్ కేసులు బయటపడగా.. 199,000 మంది వైరస్ కారణంగా చనిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా యూఎస్‌లో ఓ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ విజృంభిస్తోందని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. అదే మాంసాన్ని సంగ్రహించే విచిత్రమైన బ్యాక్టీరియా.. దాన్ని ‘విబ్రియో వల్నిఫిక్స్’గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని కనెక్టికట్‌లో ఐదుగురికి ఈ వ్యాధి సోకడంతో.. అక్కడ ఉన్న ప్రజలకు వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.

మాంసాన్ని ఆహారంగా తినే ఈ విచిత్రమైన బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణను ‘విబ్రియో వల్నిఫిక్స్’ అని అంటారు. రాష్ట్రంలోని ఐదుగురికి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. సంక్రమణ సోకినవారికి ఇంటెన్సివ్ కేర్ అత్యవసరం.. లేదంటే బ్యాక్టీరియా శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ విబ్రియో బ్యాక్టీరియా లాంగ్ ఐలాండ్‌లోని ఉప్పు లేదా ఉప్పునీటి కయ్యల నుంచి వ్యాపిస్తుందని.. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని” డాక్టర్ మాథ్యూ కార్టర్ పేర్కొన్నారు.

ఈ ఏడాది జూలైలో ఒక కేసు, ఆగష్టులో నాలుగు కేసులు నమోదయ్యాయని చెప్పిన కార్టర్.. సుమారు 49 నుంచి 85 ఏళ్ల వయసు ఉన్నవారిలోనే ఈ ఇన్ఫెక్షన్ బయటపడిందన్నారు. 2010-19 మధ్య కనెక్టికట్‌లో ఇలాంటివి ఏడు కేసులే నమోదు కాగా.. ఈ సంవత్సరం ఆ సంఖ్య భారీగా పెరిగిందన్నారు. షెల్ ఫిష్ ద్వారా వ్యాపించే ఈ ‘విబ్రియో వల్నిఫిక్స్’.. వంటిపై ఏదైనా గాయాలు ఉంటే.. వాటి నుంచి వేగంగా వ్యాపించి.. ప్రాణాంతక అనారోగ్యాలను కలిగించే అవకాశం ఉందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అందువల్ల పచ్చబొట్లు, లేదా శస్త్రచికిత్సల చేసుకున్నవారు ఉప్పు నీటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

‘కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…