ఏపీకి గుడ్ న్యూస్.. విజయసాయి రెడ్డికి కేంద్ర ఆర్థిక మంత్రి హామీ
పార్లమెంట్ లో ఏపీ సర్కారుకు శుభవార్త చెప్పింది కేంద్రం. పోలవరం ప్రాజక్టుకు సంబంధించిన రూ.3,805 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు సుముఖం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి..
పార్లమెంట్ లో ఏపీ సర్కారుకు శుభవార్త చెప్పింది కేంద్రం. పోలవరం ప్రాజక్టుకు సంబంధించిన రూ.3,805 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు సుముఖం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రాజ్యసభకు తెలిపారు. త్వరలోనే ఈ మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు. అంతకుముందు, పోలవరం ప్రాజెక్ట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈరోజు రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారని గుర్తుచేశారు. పోలవరం ప్రాజక్టుకు సంబంధించి రూ.3,805 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయడానికి సహకరించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆ లేఖలో ప్రధానిని కోరారని విజయసాయి రెడ్డి వెల్లడించారు. దీనిపై సభలోనే ఉన్న కేంద్రమంత్రి స్పందిస్తూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును ధృవీకరిస్తూ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించినట్లు తెలిపారు.