AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారిటోరియం ముగిసింది : టీజీ వెంకటేష్ ప్రశ్నలకు కేంద్రం ఫుల్ క్లారిటీ

కరోనా లాక్ డౌన్ సమయంలో ఆర్బీఐ ప్రకటించిన మారిటోరియం అంశంపై ఇప్పుడు దేశంలోని చాలా మందిని అనేక ప్రశ్నలు వెంటాడుతున్నాయి. వీటిపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ రాజ్యసభలో ప్రశ్నలు సంధించగా కేంద్రం అనేక అంశాలపై స్పష్టతనిచ్చింది. కోవిడ్-19 ప్యాకేజి ప్రకారం ఆర్బీఐ 6 నెలల పాటు మారటోరియంకు అనుమతించిందని.. మార్చి1 నుంచి ఆగస్టు 31 వరకు మారిటోరియం అమల్లో ఉందని తెలిపింది. మారటోరియం సమయంలో రుణాల చెల్లింపులు చేయని వారి ఖాతాలు ఎన్పీఏగా పేర్కొనరని పేర్కొంది. […]

మారిటోరియం ముగిసింది : టీజీ వెంకటేష్ ప్రశ్నలకు కేంద్రం ఫుల్ క్లారిటీ
Pardhasaradhi Peri
|

Updated on: Sep 15, 2020 | 1:57 PM

Share

కరోనా లాక్ డౌన్ సమయంలో ఆర్బీఐ ప్రకటించిన మారిటోరియం అంశంపై ఇప్పుడు దేశంలోని చాలా మందిని అనేక ప్రశ్నలు వెంటాడుతున్నాయి. వీటిపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ రాజ్యసభలో ప్రశ్నలు సంధించగా కేంద్రం అనేక అంశాలపై స్పష్టతనిచ్చింది. కోవిడ్-19 ప్యాకేజి ప్రకారం ఆర్బీఐ 6 నెలల పాటు మారటోరియంకు అనుమతించిందని.. మార్చి1 నుంచి ఆగస్టు 31 వరకు మారిటోరియం అమల్లో ఉందని తెలిపింది. మారటోరియం సమయంలో రుణాల చెల్లింపులు చేయని వారి ఖాతాలు ఎన్పీఏగా పేర్కొనరని పేర్కొంది. అలాగే సిబిల్ వంటి క్రెడిట్ రేటింగుపైనా ప్రభావం ఉండదన్నారు. అయితే, మారటోరియం కాలంలో వడ్డీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అర్హులైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు వడ్డీ రాయితీ వంటి మినహాయింపులు ఇచ్చే వెసులుబాటు బ్యాంకులకు ఉందని ఆర్బీఐ పేర్కొందని తెలిపింది. అంతేకాకుండా ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం బ్యాంకులు వడ్డీ రేటు మార్చవచ్చని.. బ్యాంకుకు చెల్లించాల్సిన వడ్డీని పూర్తిగా మినహాయించవచ్చని.. అపరాధ వడ్డీని పూర్తిగా రద్దు చేయవచ్చని.. వడ్డీ మొత్తాన్ని కొత్త రుణంగా పరిగణిస్తూ తిరిగి చెల్లించేందుకు మరింత అదనపు సమయాన్ని ఇవ్వొచ్చని వెల్లడించింది. అదేసమయంలో మారటోరియం ఉపయోగించుకునే రుణగ్రహీత తన ఖాతాలో సొమ్మును మరో ఖాతాలోకి బదిలీ చేయడాన్ని అడ్డుకునే నిబంధనేమీ లేదని కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.