AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుణాచల్ ప్రదేశ్‌‌ను ఎప్పుడూ గుర్తించలేదు.. కొత్త పాట పాడుతున్న చైనా

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అపహరణకు గురైన అరుణాచల్ ప్రదేశ్ నుండి తప్పిపోయిన ఐదుగురు యువకులపై తమకు తెలియదని చైనా సోమవారం బుకాయించింది.

అరుణాచల్ ప్రదేశ్‌‌ను ఎప్పుడూ గుర్తించలేదు.. కొత్త పాట పాడుతున్న చైనా
Balaraju Goud
|

Updated on: Sep 08, 2020 | 2:58 PM

Share

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్నాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని చెబుతూనే మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇన్నాళ్లూ సైన్యంతో రెచ్చగొట్టిన డ్రాగన్ కంట్రీ.. ఇప్పుడు మాటలతో ఆ పని చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను తామెప్పుడూ గుర్తించలేదన్న చైనా.. అది తమ దేశంలోని దక్షిణ టిబెట్ ప్రాంతమని కొత్త రాగం అందుకుది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ను కోట్ చేస్తూ.. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అపహరణకు గురైన అరుణాచల్ ప్రదేశ్ నుండి తప్పిపోయిన ఐదుగురు యువకులపై తమకు తెలియదని చైనా సోమవారం బుకాయించింది.”చైనా-ఇండియా సరిహద్దు యొక్క తూర్పు రంగంలో చైనా స్థానం, లేదా జాంగ్నాన్ (చైనా యొక్క జిజాంగ్ యొక్క దక్షిణ భాగం) స్థిరంగా మరియు స్పష్టంగా ఉంది. ‘అరుణాచల్ ప్రదేశ్’ అని పిలవబడే చైనా ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదు. మీరు పేర్కొన్న పరిస్థితి గురించి నాకు తెలియదు ”అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద ఐదుగురు భారతీయులు అదృశ్యమయ్యారని చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి భారత సైన్యం హాట్‌లైన్ ద్వారా సందేశం పంపిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు వ్యాఖ్యానించిన నేపథ్యంలో చైనా ఇలా స్పందించడం గమనార్హం.

వేటకు వెళ్లిన సమయంలో టగిన్ తెగకు చెందిన టోచ్ సింగ్‌కమ్, ప్రసత్, రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తను బకెర్, ఎంగ్రూ దిరి అనే ఐదుగుర్ని చైనా సైన్యం అపహరించింది. సెరా -7 ప్రాంతం నుండి చైనా ఆర్మీ అపహరించుకు వెళ్లింది. నాచోకు ఉత్తరాన 12 కిలోమీటర్ల దూరంలో యువకుల స్వస్థలమైన ఎగువ సుబన్సిరి నుంచి సరిహద్దులో ఉన్న ఆర్మీ పెట్రోలింగ్ టీం తీసుకువెళ్లింది. మరో ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకొని రావడంతో… ఈ విషయం వెలుగు చూసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తప్పిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎగువ సుబన్‌సిరి జిల్లాలోని సరిహద్దు సమీపంలో చైనా ఆర్మీ అపహరించుకు వెళ్లిందని పేర్కొన్నారు. వారి అపహరణ గురించి యువకుల కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో సందేశాలను ధృవీకరించడానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నాచోలో దర్యాప్తు ప్రారంభించింది.

24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
రూ.50లక్షలు పెడితే రూ.100కోట్లకు పైగా వసూళ్లు
రూ.50లక్షలు పెడితే రూ.100కోట్లకు పైగా వసూళ్లు
IPL 2026 Auction: వేలం తర్వాత మారిన ముగ్గురు కెప్టెన్లు..
IPL 2026 Auction: వేలం తర్వాత మారిన ముగ్గురు కెప్టెన్లు..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అదే హీరో సినిమాలో హీరోయిన్..!
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అదే హీరో సినిమాలో హీరోయిన్..!