Viral Video: చెన్నై వరదల్లో తమిళనాడు బీజేపీ నేతల ఫోటో షూట్.. ఇది మన నేతల తీరు అంటూ నెటిజన్లు సెటైర్స్

Viral Video: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడులో అతలాకుతలం అవుతోంది. ఆ రాష్ట్ర రాజధాని చైన్నై పట్టణం జలదిగ్భంధంలో చిక్కుకుంది. జనజీవనం అస్తవ్యస్తంగా..

Viral Video: చెన్నై వరదల్లో తమిళనాడు బీజేపీ నేతల ఫోటో షూట్.. ఇది మన నేతల తీరు అంటూ నెటిజన్లు సెటైర్స్
Chennai Flood

Updated on: Nov 09, 2021 | 7:00 PM

Viral Video: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడులో అతలాకుతలం అవుతోంది. ఆ రాష్ట్ర రాజధాని చైన్నై పట్టణం జలదిగ్భంధంలో చిక్కుకుంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో ప్రభుత్వ అధికారులు నేతలు, సామాజిక కార్యకర్తలు ప్రజలకు అండగా నిలబడుతున్నారు. సేవా కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా చెన్నై వరదల్లో పడవ మీద వెళ్లిమరీ వరదబాధిత ప్రాంతాల్లోని ప్రజలకు సాయం చేస్తున్నారు తమిళనాడు బీజేపీ నేతలు. అయితే  తాజాగా బీజేపీ నేతలు సాయం చేసే సమయంలో ఫోటో షూట్  తీసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..

చైన్నైలోని వరద భాదిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తమ పార్టీ నేతలతో కలిసి పడవలపై ప్రయాణిస్తూ ప్రయాణిస్తున్నారు. అయితే ఈ సమయంలో  అన్నామలై తీసుకున్న సెల్ఫీ వీడియోలపై నెటిజన్స్ సెటైర్ వేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఓ వైపు ప్రజలు వర్షాలు, వరదలతో అష్టకష్టాలు పడుతున్నారు.. తినడానికి తిండి, కనీస సౌకర్యాలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజల దగ్గరకు వెళ్ళింది. వీరు సెల్ఫీ వీడియోలు తీసుకోవడానికి ఫోటోల కోసం బీజేపీ నేతల ఆరాటం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read:  ఇక నుంచి పునీత్ రాజ్ కుమార్ బాటలోనే పయనిస్తానంటున్న గాలి జనార్దన్ రెడ్డి.. పునీత్ జ్ఞాపకార్థం ఎం చేయబోతున్నారంటే..