చనిపోయినా.. 9 మందికి జీవితాన్నిచ్చిన చరితా రెడ్డి!

| Edited By:

Jan 01, 2020 | 11:24 AM

అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి.. మరో 9మందిని బతికించింది. కారు యాక్సిడెంట్‌లో బ్రెయిన్ డెడ్‌ అయిన ఆమె అవయవాలు.. చావు బతుకుల్లో ఉన్న మరో 9 మందికి ప్రాణం పోశాయి. చరితా రెడ్డి చనిపోయినా.. ఆ 9మందికి బతుకునిచ్చిన తమ బిడ్డను చూసి గర్వ పడుతున్నామంటూ ఆమె ఫ్యామిలీ ఆనందపడుతోంది. వారిలో తమ బిడ్డ బతికే ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు చరితా తల్లిదండ్రులు. రెండ్రోజుల కిందట హైదరాబాద్‌కు చెందిన చరితారెడ్డి మిచిగాన్‌లో జరిగిన రోడ్డు […]

చనిపోయినా.. 9 మందికి జీవితాన్నిచ్చిన చరితా రెడ్డి!
Follow us on

అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి.. మరో 9మందిని బతికించింది. కారు యాక్సిడెంట్‌లో బ్రెయిన్ డెడ్‌ అయిన ఆమె అవయవాలు.. చావు బతుకుల్లో ఉన్న మరో 9 మందికి ప్రాణం పోశాయి. చరితా రెడ్డి చనిపోయినా.. ఆ 9మందికి బతుకునిచ్చిన తమ బిడ్డను చూసి గర్వ పడుతున్నామంటూ ఆమె ఫ్యామిలీ ఆనందపడుతోంది. వారిలో తమ బిడ్డ బతికే ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు చరితా తల్లిదండ్రులు.

రెండ్రోజుల కిందట హైదరాబాద్‌కు చెందిన చరితారెడ్డి మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారును.. వెనక నుంచి మరో కారు వేగంగా ఢీకొట్టడంతో బ్రెయిన్‌డెడ్‌కు గురైంది చరితారెడ్డి. ఆమెతో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ముస్కేగాన్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చరితారెడ్డి బ్రెయిన్‌ డెడ్ అయి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

సోమవారం ఆమె కుటుంబ సభ్యుల పర్మిషన్‌తో చరితారెడ్డి అవయవాలు డొనేట్ చేశారు డాక్టర్లు. లివర్, గుండె కవాటాలు, కిడ్నీలు, కళ్లను డాక్టర్లు మంగళవారం స్థానిక గిఫ్ట్ లైఫ్ హాస్పిటల్‌లో ఆమె బాడీ నుంచి తీశారు.  తాను చనిపోయి.. 9మందిని బతికించిన గొప్ప వనిత చరితారెడ్డి అంటూ ఇప్పుడు అమెరికా సమాజం ఆమెను కీర్తిస్తోంది. అంత విషాదంలోనూ ఆమె ఫ్యామిలీ గొప్ప నిర్ణయం తీసుకుని విషాదంగా ముగియాల్సిన మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపారంటూ అక్కడి వైద్యులు వారి త్యాగాన్ని కొనియాడారు.

షీ ఈజ్ మై సూపర్ హీరో అంటూ గొప్పగా చెప్పుకొచ్చారు ఆమె కుటుంబసభ్యులు. చనిపోయినా.. 9 మంది జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వనిత అని.. తమకు గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఆసుపత్రి సిబ్బంది కూడా ఆమె త్యాగాన్ని కొనియాడుతూ చరితారెడ్డి ఫ్యామిలీకి ఓ మెసేజ్ వీడియో పంపారు. కాగా.. ఆమె భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.