
SP Balasubrahmanyam : కోవిడ్‌తో పోరాడుతున్న లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు చరణ్ తెలిపారు. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. తన తండ్రి కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్న అందరికీ చరణ్ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
నిన్నటితో పోలిస్తే మా నాన్నగారు ఆరోగ్య పరిస్థితిపై కొత్త సమాచారం ఏమీ లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల మొదటి వారంలో ఎస్పీ బాలు కరోనా బారిన పడటంతో ఆయన్ను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్, ఎక్మో సాయంతో ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నారు.