AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సోనియా

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. విభజన శక్తులు దేశంలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ భావ ప్రకటనా స్వేచ్చను హరిస్తున్నాయని మండిపడ్డారు. నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితులు, సంక్షోభం నెలకొంటాయని పూర్వీకులు, నాయకులు ఎవరూ ఊహించి ఉండరన్నారు. భారత ప్రజలు, మన గిరిజనులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాలు నోరెత్తకుండా ఉండాలని కోరుకుంటున్నారని ఆక్షేపించారు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రమాదంలో […]

తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సోనియా
Pardhasaradhi Peri
|

Updated on: Aug 29, 2020 | 9:22 PM

Share

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. విభజన శక్తులు దేశంలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ భావ ప్రకటనా స్వేచ్చను హరిస్తున్నాయని మండిపడ్డారు. నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితులు, సంక్షోభం నెలకొంటాయని పూర్వీకులు, నాయకులు ఎవరూ ఊహించి ఉండరన్నారు. భారత ప్రజలు, మన గిరిజనులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాలు నోరెత్తకుండా ఉండాలని కోరుకుంటున్నారని ఆక్షేపించారు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయని.. నియంతృత్వ పోకడలు పెచ్చుమీరుతున్నాయని.. ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో నూతన అసెంబ్లీ భవన శంకుస్థాపన సందర్భంగా వీడియో కాల్‌ ద్వారా సోనియా గాంధీ హిందీలో ప్రసంగించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, తన ప్రసంగంలో సోనియా ఎక్కడా అధికార పార్టీ పేరు ప్రస్తావించకుండానే మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టడం విశేషం.

Follow Us
తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
పచ్చి బొప్పాయి vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పచ్చి బొప్పాయి vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!
డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..
పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ
పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ
చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు
చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..
NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!
NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!
23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!
23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!