AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satya Dev : అతడు చేసిన ఆ ఒక్క మెసేజ్.. నా గుండె పగిలేలా చేసింది.. హీరో సత్యదేవ్..

తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సత్యదేవ్. జ్యోతిలక్ష్మి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో రాణిస్తున్నారు. ప్రస్తుతం సమవర్తి అనే చిత్రంలో నటిస్తున్నారు.

Satya Dev : అతడు చేసిన ఆ ఒక్క మెసేజ్.. నా గుండె పగిలేలా చేసింది.. హీరో సత్యదేవ్..
Satyadev
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2026 | 10:35 AM

Share

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సత్యదేవ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోగా, విలన్ గా వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం సమవర్తి, రావు బహదూర్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. చిన్న పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టి జ్యోతిలక్ష్మీ, బ్లఫ్ మాస్టర్ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ లోని ఎదురైన సవాళ్లు, ఒడిదుడుకులు, కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన కృష్ణమ్మ సినిమా ఫలితంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

సత్యదేవ్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో వచ్చిన సినిమా కృష్ణమ్మ. తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని సత్యదేవ్ అన్నారు. రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతున్న సమయంలోనే ఎన్నికల కారణంగా థియేటర్ల వద్ద ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. అయితే తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఆరో రోజుకే సినిమాను ఓటీటీలోకి తెచ్చేశారని.. థియేటర్లలో చూడమని తాను పోస్టులు పెడుతుంటే.. ఓటీటీ స్క్రీన్ షాట్ పంపి ఒక అభిమాని కోప్పడడంతో తన గుండె పగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ఒక్క శుక్రవారం విజయం కోసం తాము రెండేళ్లపాటు కష్టపడి ఎదురుచూస్తామని.. అలాంటిది సినిమా విడుదలయ్యాక ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తీవ్రంగా బాధపడి ఏడుస్తామని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ మళ్లీ లక్ష్యాలను గుర్తు చేసుకుని కొత్త యుద్ధాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఓపెన్ యూనివర్సిటీలాంటిదని.. ఇక్కడ ఎవరైనా వచ్చి టాలెంట్ నిరూపించుకోవచ్చని.. కానీ ఇక్కడ సక్సెస్ రేటు అనేది చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం సత్యదేవ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి
ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?
ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?
ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
హోటళ్లలో 13వ నంబర్ రూమ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదీ!
హోటళ్లలో 13వ నంబర్ రూమ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదీ!
ప్రేక్షకుల ముందుకు మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్స్..
ప్రేక్షకుల ముందుకు మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్స్..