జూలై 22న మళ్లీ చంద్రయాన్-2 ప్రయోగం

| Edited By:

Jul 18, 2019 | 12:19 PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈ ప్రయోగాన్ని ఈ నెలాఖరున చేపట్టేందుకు ఇస్రో అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చంద్రయాన్‌–2 రాకెట్‌ ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదట మొదటి వారంలో నింగిలోకి పంపాలని అనుకున్నప్పటికీ […]

జూలై 22న  మళ్లీ చంద్రయాన్-2 ప్రయోగం
Follow us on

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈ ప్రయోగాన్ని ఈ నెలాఖరున చేపట్టేందుకు ఇస్రో అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చంద్రయాన్‌–2 రాకెట్‌ ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మొదట మొదటి వారంలో నింగిలోకి పంపాలని అనుకున్నప్పటికీ ఆతర్వాత జూలై 15కి వాయిదా వేశారు. అనుకోని సాంకేతిక లోపంతో ప్రయోగం ఆగిపోయింది. ఈ లోపాన్ని సరిచేసి మళ్లీ ఈ నెలాఖరునాటికి గగనతలం లోకి పంపేందుకు శాస్ర్తవేత్తలు ప్రయత్నిస్తున్నారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని కన్నులారా వీక్షించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ప్రయోగం రోజున వచ్చి వెనుదిరిగారు. బయటినుంచి వచ్చే సందర్శకుల కోసం పెద్ద ఎత్తున ఇస్రో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసింది. అనుకున్న సమయానికి ప్రయోగం జరగకపోవడంతో వీరంతా తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

చంద్రునిపై అనేక రకాల ప్రయోగాల కోసం చంద్రయాన్-2ను ప్రయోగిస్తున్నారు. అయితే గతంలో చంద్రయాన్ -1 కూడా పరీక్షించారు. దీన్ని ప్రయోగించిన 11 సంవత్సరాల తర్వాత ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగానికి బాహుబలిగా పిలుచుకునే జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3 రాకెట్‌ను వాడుతున్నారు.ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై వ్యోమనౌకను ప్రవేశపెట్టిన 4వ దేశంగా భారత్‌ ఘనత సాధించనుంది. మరోవైపు ఇప్పటికే అమెరికా రష్యా, చైనా వంటి దేశాలు ఈ ప్రయోగంలో ముందు వరసలో ఉన్నాయి.