యూఏఈకి చెందిన ప్రముఖ సంస్థ లులూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న తెలివి తక్కువ నిర్ణయాలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నో సంప్రదింపులు.. నిరంతరం వెంటపడి లూలూ గ్రూప్‌ను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించానని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుతో విశాఖలోని యువతకు వేలాది ఉద్యోగాలు రావడమే కాకుండా… స్థానికంగా ఆర్థిక అభివృద్ధి ఎంతో మెరుగుపడేదని చెప్పుకొచ్చారు.
జగన్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా తమ శ్రమంతా వృధా అయిందని చంద్రబాబు వాపోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యత లేని ఇలాంటి చర్యలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని దెబ్బ తీయడమే కాకుండా.. యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నాయన్నారు. కాగా, లూలూ గ్రూప్‌కు ఇలా జరిగినందుకు ఏపీ ప్రజల తరపున, ముఖ్యంగా విశాఖవాసుల తరపున చంద్రబాబు విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను.
బాధ్యత లేని ఇలాంటి చర్యలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తాయి. లూలూ గ్రూప్ కు ఇలా జరిగినందుకు ఏపీ ప్రజల, విశాఖవాసుల తరపున విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను.(2/2)#LuluSaysByeByeAP
— N Chandrababu Naidu (@ncbn) November 21, 2019