మరో రెండు వికెట్లు తీస్తే నెంబర్ వన్ ప్లేస్… బుమ్రా రికార్డు పై కన్నేసిన చాహల్
భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో యుజ్వేంద్ర చాహాల్ కీలకంగా మారాడు. మొన్న జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి భారత విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.
భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో యుజ్వేంద్ర చాహాల్ కీలకంగా మారాడు. మొన్న జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి భారత విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది భారత్ . రేపు రెండో మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్ లో చాహాల్ రెండు వికెట్లు తీసుకుంటే పేసర్ జస్ప్రిత్ బుమ్రా రికార్డును బ్రేక్ చేస్తాడు. ఇప్పటి వరకు బుమ్రా 49 అంతర్జాతీయ టీ20లు ఆడి 59 వికెట్లు తీసాడు. 43 టీ20లు ఆడిన చాహల్ 58 వికెట్లు పడగొట్టాడు. రేపటి మ్యాచ్ లో రెండు వికెట్లు తీస్తే బుమ్రాను దాటేస్తాడు చాహల్. అదే ఒక్క వికెట్ తీస్తే బుమ్రా రికార్డును సమం చేస్తాడు. రెండు వికెట్లు కనుక తీస్తే టీ 20 ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ రికార్డులకెక్కుతాడు.