ఎయిర్ పోర్టుల్లో జర భద్రం ! సెక్యూరిటీ కట్టుదిట్టం !

దేశ స్వాతంత్య్ర దినోత్సవాలకు ముందు వైమానిక ఉగ్రవాద సంబంధ దాడులు జరగవచ్చునని ఇంటెలిజెన్స్ హెచ్ఛరికలు జారీ అయిన వేళ… ప్రభుత్వం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పూనుకొంది. పౌర విమానయాన శాఖ ఈ మేరకు ఓ సెక్యూరిటీ అడ్వైజరీ ని విడుదల చేస్తూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా నివారించేందుకు సెక్యూరిటీ ప్రొటొకాల్స్ కు ఖఛ్చితంగా కట్టుబడి ఉండాలని సూచించింది. ముఖ్యంగా విమానాశ్రయాలు సహా కీలక ప్రాంతాల్లో తగినంత భద్రత ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను […]

ఎయిర్ పోర్టుల్లో జర భద్రం ! సెక్యూరిటీ కట్టుదిట్టం !
Follow us

|

Updated on: Aug 08, 2019 | 1:51 PM

దేశ స్వాతంత్య్ర దినోత్సవాలకు ముందు వైమానిక ఉగ్రవాద సంబంధ దాడులు జరగవచ్చునని ఇంటెలిజెన్స్ హెచ్ఛరికలు జారీ అయిన వేళ… ప్రభుత్వం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పూనుకొంది. పౌర విమానయాన శాఖ ఈ మేరకు ఓ సెక్యూరిటీ అడ్వైజరీ ని విడుదల చేస్తూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా నివారించేందుకు సెక్యూరిటీ ప్రొటొకాల్స్ కు ఖఛ్చితంగా కట్టుబడి ఉండాలని సూచించింది. ముఖ్యంగా విమానాశ్రయాలు సహా కీలక ప్రాంతాల్లో తగినంత భద్రత ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను అధికారులు కోరారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటన చేసిన అనంతరం.. ఉగ్రవాద వర్గాలు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలను సాఫ్ట్ టార్గెట్లుగా చేసుకోవచ్ఛునని సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కోల్ కతా తదితర మెట్రోపాలిటన్ నగరాల్లో కనీవినీ ఎరుగని భద్రత కల్పించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సూచించింది. ఈ మేరకు విమానాశ్రయాలకు కనీసం ఒక కిలో మీటర్ దూరంలోనే వాహనాలను నిలిపివేస్తారు. ప్రతి ప్రయాణికుడిని, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 31 వరకు అమలులో ఉంటాయి. విజిటర్ల ఎంట్రీపై ఈ నెల 10 నుంచి ఆంక్షలు విధించారు. కేవలం ప్రయాణికులను మాత్రమే ఎయిర్ పోర్టుల్లోకి అనుమతిస్తారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవాల అనంతరం ఒక వారం వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండవచ్చు. హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా అన్ని ఎయిర్ పోర్టుల్లో సి ఐ ఎస్ ఎఫ్ తో బాటు క్విక్ రెస్పాన్స్ టీమ్ ని నియమిస్తున్నారు. ఈ టీమ్ ఏ అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగుతుంది.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..