Kishan Reddy: 3T వ్యూహంతో కరోనాను కట్టడి చేయాలిః కిషన్ రెడ్డి

|

Jul 12, 2020 | 6:31 PM

 Kishan Reddy Comments: కరోనా వైరస్ మహమ్మారి దేశం సమర్ధవంతంగా ఎదుర్కుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5లక్షల యాభై వేలు మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆయన అన్నారు. అటు దేశంలో మరణాల రేట్ కేవలం 2.66 శాతం మాత్రమే ఉందన్నారు. మరణాల రేటును కూడా తగ్గేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో 1239 కోవిడ్ ఆసుపత్రులు, 5లక్షల బెడ్స్, 34479 ఐసీయూ బెడ్స్, […]

Kishan Reddy: 3T వ్యూహంతో కరోనాను కట్టడి చేయాలిః కిషన్ రెడ్డి
Follow us on

 Kishan Reddy Comments: కరోనా వైరస్ మహమ్మారి దేశం సమర్ధవంతంగా ఎదుర్కుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5లక్షల యాభై వేలు మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆయన అన్నారు. అటు దేశంలో మరణాల రేట్ కేవలం 2.66 శాతం మాత్రమే ఉందన్నారు. మరణాల రేటును కూడా తగ్గేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రస్తుతం దేశంలో 1239 కోవిడ్ ఆసుపత్రులు, 5లక్షల బెడ్స్, 34479 ఐసీయూ బెడ్స్, 1194 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. అన్ని రాష్ట్రాలకు ఎన్ 95 మాస్క్‌లు, పీపీఈలు పంపిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణకు సుమారు 7,44,000 ఎన్ 95 మాస్క్‌లు, 2,41,000 పీపీఈలు, 2,25,0000హెచ్సీక్యూ ట్యాబ్లెట్‌లు పంపించామని స్పష్టం చేశారు.

కరోనాకు సంబంధించి తెలంగాణకు కేంద్రం 215 కోట్ల నిధులను విడుదల చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు.. లాక్ డౌన్ విధించడం వంటి నిర్ణయాలను రాష్ట్రాలకే వదిలేశామన్నారు. తెలంగాణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ట్రేసింగ్… టెస్టింగ్… ట్రీటింగ్ సెటప్ వేగవంతంగా చేయాలన్నారు. కరోనా చికిత్సలో ప్రజలకు విశ్వాసం కల్పించాలని.. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళలేక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరలేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి భరోసా కల్పించాలని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read:

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!