AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ “బజరంగీ-2” మూవీ టీజ‌ర్..అద‌ర‌హో…

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన కొత్త చిత్రం "బజరంగీ-2" టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీ 2013 లో వచ్చి పెద్ద హిట్ అయిన " బజరంగీ " చిత్రానికి సీక్వెల్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బజరంగీ-2 మూవీ టీజ‌ర్..అద‌ర‌హో...
Ram Naramaneni
|

Updated on: Jul 12, 2020 | 7:31 PM

Share

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన కొత్త చిత్రం “బజరంగీ-2″ టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీ 2013 లో వచ్చి పెద్ద హిట్ అయిన ” బజరంగీ ” చిత్రానికి సీక్వెల్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కన్నడ చిత్రమే అయిన కానీ పాన్ ఇండియా చిత్రం లాగా బాలీవుడ్ తో సహా అన్ని సౌత్ భాషల వాళ్ళు ఈ చిత్ర టీజర్ ను ఆన్ లైన్ లో షేర్ చేస్తూ టీజర్ భలే ఉందంటూ మెచ్చుకోవడం విశేషం.ఈ రెస్పాన్స్ చూసి దర్శక నిర్మాతలు ఈ సినిమా ను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.త్వరలోనే తెలుగు లో కూడా ఈ సినిమా డబ్ కానుంది.టీజర్ చూసి పలువురు ప్రొడ్యూసర్ లు, డిస్ట్రిబ్యూటర్ లు ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం ఎంక్వైరీ చేశారు.

టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ గురుంచి హీరో శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ ” 2013 లో మేము తీసిన “బజరంగీ” పెద్ద హిట్ కావడం తో దానికి సీక్వెల్ గా ఈ “బజరంగీ-2″ మూవీ భారీ గా తీయాలని భావించాం. కానీ ఈ టీజర్ కు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.అన్ని ఇండస్ట్రీ ల నుండి కాల్స్ వస్తున్నాయి. ఈ అద్భుతమైన రెస్పాన్స్ కి అందరికీ ధన్యవాదాలు” అన్నారు.

“బజరంగీ-2” టీజర్ విజువల్ గా అద్భుతంగా ఉంది.బాక్ గ్రౌండ్ స్కోర్,గ్రాఫిక్స్ షాట్స్ చూస్తుంటే మరో “కెజిఎఫ్” తరహా సినిమా కాబోతుంది అనిపిస్తుంది.పీరియాడిక్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో శివరాజ్ కుమార్ సరసన భావన హీరోయిన్ గా నటిస్తుంది. జయన్న ఫిలిమ్స్ బ్యానర్ పై జయన్న మరియు భోగేంద్ర కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ ని ఎ.హర్ష డైరెక్ట్ చేశారు.థియేటర్ లు ఓపెన్ అవ్వగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Follow Us
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్
రోజుకు 2 నిమిషాలు ఒంటి కాలిపై నిలబడి బ్రష్ చేయండి..! లాభాలు ఇవే
రోజుకు 2 నిమిషాలు ఒంటి కాలిపై నిలబడి బ్రష్ చేయండి..! లాభాలు ఇవే
నిందితుడి భార్య ఖాతా చూసి పోలీసుల మైండ్ బ్లాక్..!
నిందితుడి భార్య ఖాతా చూసి పోలీసుల మైండ్ బ్లాక్..!
పీఎఫ్‌ లబ్థిదారులకు బిగ్ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఇకపై
పీఎఫ్‌ లబ్థిదారులకు బిగ్ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఇకపై
ఇదేం సినిమా పిచ్చిగా ఉందన్నారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్.. ఇప్
ఇదేం సినిమా పిచ్చిగా ఉందన్నారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్.. ఇప్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
సంచలన ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి మళ్లీ నిరాశే
సంచలన ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి మళ్లీ నిరాశే
ఆదివారం మటన్ తింటున్నారా? అయితే,ఏ ముక్కల్లో ఎక్కువ కొవ్వు ఉంటుంది
ఆదివారం మటన్ తింటున్నారా? అయితే,ఏ ముక్కల్లో ఎక్కువ కొవ్వు ఉంటుంది
భార్య హత్య.. కోడలిపై మామ రివేంజ్.. ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ ట్రె
భార్య హత్య.. కోడలిపై మామ రివేంజ్.. ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ ట్రె