కుక్కతోక వంకర అయినట్లు పాకిస్తాన్ వక్రబుద్ధి మారడం లేదు. పీఓకే నుంచి దొంగ దారుల గుండా టెర్రరిస్టులను దేశంలోకి పంపిస్తోంది. మరో వైపు దేశ సరిహద్దు రాష్ట్రాల్లో ఉగ్రవాద శక్తులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా కాలగర్బంలో కలిసిపోయిన ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థకు తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తోంది.
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్తాన్ నెట్ వర్క్ పై విరుచుకుపడేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఖలిస్తాన్ అనుకూల సంస్థ ఉగ్రవాదులు, సానుభూతిపరులపై దర్యాప్తును ముమ్మరం చేయబోతోంది. ఎన్ఏఐ,ఈడీ, సీబీఐ ఆదాయపు పన్ను శాఖ వంటి చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలను ఖలిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాద సంస్థలు హైజాక్ చేసినట్లు వార్తలు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే ఇందుకు సంబంధించిన కొన్ని ఆదారాలను కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ సేకరించింది. మనదేశంలోని యువతను మత్తు పదార్థాలకు బానిసలను చేసేందుకు పాకిస్తాన్ చేసిన కుట్రను భగ్నం చేశారు నిఘా అధికారులు. మనదేశంలోకి అక్రమంగా మత్తుపదార్థాలను స్మగ్లింగ్ చేసేందుకు పాకిస్తాన్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. తాజాగా రెండు రోజుల క్రితం బయటపడిన ఓ కేసు ఖలిస్తాన్ అలాంటి గుట్టును రట్టు చేశారు నార్కోటిక్స్ శాఖ అధికారులు.
మరోవైపు దీనికి ఖలిస్తాన్ లింక్ కూడా ఉండటంతో మరింత అప్రమత్తమైంది. క్రాస్-బార్డర్ స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేసిన పంజాబ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. డ్రోన్ల ద్వారా వీరు నిషిద్ధ మత్తు పదార్థాలను చేరవేస్తున్నారని తేల్చారు.
ఖలిస్తాన్ ఆపరేటివ్స్ పాత్ర కూడా ఇందులో ఉండగా ఇదో పెద్ద అంతర్జాతీయ నెట్వర్క్ తో పనిచేసే వ్యవహారంగా తేల్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అమృత్ సర్ జైలులో నలుగురు డ్రగ్ స్మగ్లర్లుండగా, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఈ స్మగ్లింగ్ వెనుకున్న శక్తులను గుర్తించవచ్చని పోలీసులు వివరించారు.
విదేశీ స్మగ్లర్లతో ఇతనికి స్మగ్లింగ్ నెట్వర్క్ ఉండగా, చిష్టి వంటి పాకిస్తాన్‌కు చెందిన పేరుమోసిన స్మగ్లర్లతో లక్భీర్ కాంటాక్ట్ లో ఉన్నాడు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ ఆపరేటివ్స్ తో చిష్టి టచ్ లో ఉన్నాడు. గతంలో జరిగిన ఇలాంటి క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ లోనూ ఇతని పాత్ర ఉంది. అయితే ఇలాంటి వారు పంజాబ్ రాష్ట్రంలో ఎవరున్నారు అనే కోణంలో నిఘా అధికారలు విచారణ జరుపుతున్నారు.