బిగ్ బాస్ 4: అగ్రస్థానంలో స్థిరంగా కొనసాగుతున్న అభిజిత్.! రెండో ప్లేస్‌ కోసం సోహైల్, అరియానా మధ్య పోరు.!!

మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరన్నది తేలిపోతుంది. అభిజిత్, సోహైల్, అఖిల్, అరియానా, హారిక ట్రోఫీ కోసం పోటీ పడుతున్నారు.

బిగ్ బాస్ 4: అగ్రస్థానంలో స్థిరంగా కొనసాగుతున్న అభిజిత్.! రెండో ప్లేస్‌ కోసం సోహైల్, అరియానా మధ్య పోరు.!!
Ravi Kiran

|

Dec 17, 2020 | 5:41 PM

Bigg Boss 4: మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరన్నది తేలిపోతుంది. అభిజిత్, సోహైల్, అఖిల్, అరియానా, హారిక ట్రోఫీ కోసం పోటీ పడుతున్నారు. ఒకవైపు షో నిర్వాహకులు గ్రాండ్ ఫినాలే పనుల్లో నిమగ్నమై ఉంటే.. తమకు నచ్చిన కంటెస్టెంట్ గెలుపొందేందుకు ఫ్యాన్స్ ఓట్లు భారీగా గుద్దుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో బిగ్ బాస్ 4 విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై అనధికారిక పోల్స్ నిర్వహిస్తున్నారు. ఇక అన్నింటిలోనూ అభిజిత్ అగ్రస్థానంలో స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

అన్ని పోల్స్‌లోనూ దాదాపు 50 శాతం ఓట్లు అభిజిత్ ఖాతాలోకి వెళ్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత పలు పోల్స్‌లో సోహైల్ రెండో స్థానం.. అరియానా మూడో స్థానంలో కొనసాగుతుండగా.. మరికొన్నింటిలో అరియానా రెండు.. సోహైల్ మూడో ప్లేస్‌లో ఉన్నారు. ఇక యాంగ్రీ యంగ్ మ్యాన్ అఖిల్ నాలుగో స్థానం, హారిక చివరి స్థానంలో ఉన్నట్లు పలు అన్‌- అఫీషియల్ పోల్స్ చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బిగ్ బాస్ 4 టైటిల్ విజేత అభిజిత్ కావాలని కోరుకుంటున్నారు. మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే అభిజిత్ జెంటిల్‌మాన్ గేమ్ ఆడాడని.. ట్రోఫీ గెలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని వారి వాదన. మరి ఇంతకీ బిగ్ బాస్ 4 టైటిల్‌ను అభిజిత్ ఎగరేసుకునిపోతాడో..? లేదో.? తెలియాలంటే వీకెండ్ దాకా ఆగాల్సిందే.

Also Read:

బిగ్ బాస్ 4 ఓటింగ్: అగ్రస్థానంలో అరియానా.. రెండో స్థానంలో అభిజిత్..!

పోలీసులను ఆశ్రయించిన మోనాల్ గజ్జర్.. అభిజిత్ ఫ్యాన్స్‌పై ఫిర్యాదు..

”మాయా స్తంభం పోయే.. రాక్షసుడి స్టాట్యూలు వచ్చే”.. వైరల్ ఫోటోలు..

ఏడుకొండలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమా..? 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu