Central Government Clarity: డీమోనిటైజేషన్ పేరుతో మోదీ సర్కార్ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఉన్న అవినీతి, బ్లాక్ మనీను నిర్మూలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక వాటి స్థానంలో కొత్తగా రూ.2 వేల నోటును అమలులోకి తీసుకొచ్చారు. అయితే వాటి కన్నా పెద్ద నోటును అమలులోకి తేవడంతో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు గత కొద్దిరోజులుగా రూ.2 వేల నోట్లను కేంద్రం రద్దు చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాక ఏటీఎంలలో కూడా అవి కనిపించకపోవడంతో ఊహాగానాలు కొనసాగాయి. దీనిపై పలుమార్లు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది.
Also Read: శృంగార సర్వేలో షాకింగ్ న్యూస్.. మహిళలూ టాపేనట.!
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులతో సమావేశమయ్యారు. రూ.2 వేల నోట్లను తాము ఏటీఎంలలో పెట్టొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఆ వార్తలన్నీ వట్టి పుకార్లేనని వెల్లడించారు. దీనితో రూ.2 వేల నోట్ల రద్దు గురించి ప్రచారానికి తెరపడుతుందో లేదో వేచి చూడాలి.
రూ.2000 వేల నోట్లకు బదులు రూ.500…
ఏటీఎంలలో రూ.2 వేల నోట్లకు బదులు రూ.500 నోట్లు పెట్టాలని ఇటీవల ఇండియన్ బ్యాంక్ అధికారులు నిర్ణయించారు. పెద్ద నోట్ల స్థానంలో రూ.200, రూ.500 నోట్లు పెడతామని తెలిపారు. కస్టమర్లు రూ.2000 ఏటీఎంల నుంచి డ్రా చేసుకుని చిల్లర కోసం బ్యాంక్‌కు వస్తున్నారని.. అది కాస్తా పెద్ద సమస్యగా మారిందని అన్నారు. అందువల్లే ఖాతాదారుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.