AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Management: ట్రాఫిక్ కష్టాలకు చెక్‌.. త్వరలోనే రంగంలోకి స్మార్ట్ ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్..

రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించి.. అత్యవసర వాహనాలను ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తూ.. రూల్స్ పాటించని వారికి చెక్‌ పెట్టేలా.. సరికొత్త ట్రాఫిక్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతుంది.రూ.1,789.52 కోట్ల అంచనా వ్యయంతో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం కూడా తెలిపింది.

Traffic Management: ట్రాఫిక్ కష్టాలకు చెక్‌.. త్వరలోనే రంగంలోకి స్మార్ట్ ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్..
Intelligent Traffic Management System
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Sep 30, 2026 | 4:43 PM

Share

ఢిల్లీలో ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1,789.52 కోట్ల అంచనా వ్యయంతో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌‌ను ఢిల్లీ పోలీసులు అమలు చేయనున్నారు. ఢిల్లీలోని 42 ప్రధాన ట్రాఫిక్ కారిడార్లను మూడు దశల్లో 24 నెలల్లోగా ITMS పరిధిలోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు ఆపరేషన్, మెయింటెనెన్స్ కొనసాగనుంది.

ఈ వ్యవస్థలో ఏఐ ఆధారిత అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్, రియల్‌టైమ్ ట్రాఫిక్ సమాచారం, ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా సిగ్నల్ టైమింగ్‌లు వాటంతట అవే మారుతాయి. మొదటి ఫేజ్‌లో ఏడాది కాలంలో 5 కారిడార్లలో 250 స్మార్ట్ సిగ్నల్స్, ప్రధాన కమాండ్ సెంటర్ ఏర్పాటవుతుంది.

ఫేజ్ 2లో ఆరునెలల్లో 7 కారిడార్లలో 222 స్మార్ట్ సిగ్నల్స్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటవుతుంది. మూడో ఫేజ్‌లో ఆరునెలల్లో 30 కారిడార్లలో 620 స్మార్ట్ సిగ్నల్స్ ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ నేతృత్వంలోని మూడు కమిటీలు పరిశీలిస్తాయి.

అత్యవసర వాహనాలకు గ్రీన్ కారిడార్

అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాలకు గ్రీన్ కారిడార్ సౌకర్యం కల్పించనున్నారు. ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలను రియల్‌టైమ్‌లో గుర్తించి వేగంగా స్పందించేలా వ్యవస్థను రూపొందించనున్నారు. రాంగ్ రూట్, స్పీడింగ్, రెడ్‌లైట్ జంపింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ ఉల్లంఘనలు, ఇల్లీగల్ పార్కింగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడకం వంటి ఉల్లంఘనలను టెక్నాలజీ సాయంతో గుర్తించేలా ఉంటుంది. ఏఐ అనలిటిక్స్ ద్వారా దొంగిలించిన, బ్లాక్‌లిస్ట్ చేసిన వాహనాలు, రిపీట్ ఉల్లంఘనలు కూడా గుర్తించబడతాయి.

వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కమ్యూటర్లకు రద్దీ, డైవర్షన్‌లు, పార్కింగ్ సమాచారం అందిస్తారు. ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, సెక్యూర్ డేటా సెంటర్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. దీనికి సీ-డ్యాక్ (C-DAC) సాంకేతిక సహకారం అందిస్తుంది.

ఢిల్లీలో సుమారు 71 లక్షల యాక్టివ్ రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయి. రోడ్డు మౌలిక సదుపాయాల విస్తరణ కంటే వాహనాల పెరుగుదల ఎక్కువగా ఉండటంతో ఈ అధునాతన వ్యవస్థ ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రోడ్ సేఫ్టీని గణనీయంగా మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us