AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొందరపడ్డావ్ రా అబ్బాయ్.. కచ్చితంగా బాధపడతావ్.. కోహ్లీపై కపిల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Virat Kohli Test Retirement: విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన నిర్ణయంపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) మరోసారి స్పందించారు. ప్రస్తుత ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తే కోహ్లీ ఇంకా రెండుమూడేళ్లు ఆడగలడని ఆయన అభిప్రాయపడ్డారు. టెస్టు రిటైర్మెంట్‌పై కోహ్లీ పునరాలోచించాలని కోరారు. చివరి నిర్ణయం మాత్రం కోహ్లీదేనని స్పష్టం చేశారు.

Venkata Chari
|

Updated on: Sep 30, 2026 | 3:08 PM

Share
Virat Kohli Test Retirement: విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 139 పరుగులతో అదరగొట్టిన అతడు తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరోసారి చూపించాడు. ఈ ఇన్నింగ్స్‌ తరువాత కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌పై చర్చ కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కోహ్లీ వయసు పెరుగుతున్నా అతని ఫిట్‌నెస్ స్థాయి చూస్తే ఇంకా కొంతకాలం టెస్టు క్రికెట్ ఆడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆటపై ఆసక్తి, ప్యాషన్ కొనసాగుతున్న సమయంలో రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని కపిల్ ప్రశ్నించారు. మరో రెండుమూడేళ్లు ఇదే స్థాయి ఫిట్‌నెస్ కొనసాగితే కోహ్లీ మరిన్ని రికార్డులను అందుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. టెస్టు క్రికెట్‌కు కోహ్లీ వీడ్కోలు పలకడం తనకు బాధ కలిగించిందని కపిల్ తెలిపారు.

1 / 5
టెస్టులకు కోహ్లీ సరిపోతాడన్న కపిల్: మాజీ క్రికెటర్‌గా, ప్రేక్షకుడిగా చూస్తే కోహ్లీ మరికొంతకాలం టెస్టులు ఆడాల్సిందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఆటపై ప్రేమ ఉన్నప్పుడు ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ కొనసాగడం సాధ్యమేనని చెప్పారు. టీ20 క్రికెట్‌తో పోలిస్తే టెస్టు క్రికెట్ పూర్తిగా భిన్నమైన ఫార్మాట్ అని వివరించారు. కోహ్లీ ఆటతీరుకు టెస్టులు బాగా సరిపోతాయని ఆయన పేర్కొన్నారు.

2 / 5
నిర్ణయంపై పునరాలోచించాలని సూచన: కొన్ని సంవత్సరాల తరువాత టెస్టులు మరికొంతకాలం ఆడకపోయినందుకు కోహ్లీ పశ్చాత్తాపపడే అవకాశం ఉందని కపిల్ దేవ్ అన్నారు. 37-38 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుంటే కోహ్లీ కొనసాగగలడని ఆయన అభిప్రాయపడ్డారు.

3 / 5
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో 139 పరుగులతో కోహ్లీ అజేయంగా నిలవడం కూడా కపిల్ వ్యాఖ్యలకు సందర్భంగా మారింది. ప్రస్తుత ఫామ్‌తో పాటు ఫిట్‌నెస్‌ను కొనసాగించగలిగితే అతని కెరీర్‌లో మరిన్ని ఘనతలు నమోదయ్యే అవకాశం ఉందని కపిల్ చెప్పారు.

4 / 5
అయితే కోహ్లీకి ఏది మంచిదో నిర్ణయించే హక్కు అతడికే ఉందని కపిల్ స్పష్టం చేశారు. బయట ఉన్నవారు సలహా మాత్రమే ఇవ్వగలరని, తుది నిర్ణయం మాత్రం కోహ్లీదేనని అన్నారు. టెస్టు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని మళ్లీ ఆ ఫార్మాట్‌లోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. వన్డే క్రికెట్‌లో కూడా కోహ్లీ మరికొన్ని సంవత్సరాలు కొనసాగాలని కపిల్ ఆకాంక్షించారు.

5 / 5
Follow Us