AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భీమ్‌రెడ్డి కేసులో కీలక మలుపు.. బినామీలపై ఏసీబీ, ఐటీ ఫోకస్

అక్రమాస్తుల కేసులో సస్పెండ్ అయిన తెలంగాణ మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. ఏసీబీ సోదాల్లో రూ.200 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇతరుల పేర్లపై ఉన్న ఆస్తుల్లో భీమ్‌రెడ్డి పెట్టుబడులు ఉన్నాయా అనే కోణంలో బినామీ ఆస్తులపై కూడా విచారణ సాగుతోంది.

భీమ్‌రెడ్డి కేసులో కీలక మలుపు.. బినామీలపై ఏసీబీ, ఐటీ ఫోకస్
Sankireddy Bhim Reddy
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Sep 30, 2026 | 4:34 PM

Share

అక్రమాస్తుల కేసులో సస్పెండ్ అయిన తెలంగాణ మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి వ్యవహారం రోజురోజుకూ మరింత కీలకంగా మారుతోంది. డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేసిన సమయంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయగా, జూన్ 27న తెలంగాణ, కర్ణాటకలోని 16 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో భూములు, ఇళ్లు, ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు తదితర ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తులో కొన్ని ఆస్తులు ఇతరుల పేర్లపై ఉన్నప్పటికీ వాటి వెనుక భీమ్‌రెడ్డి పెట్టుబడులు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు బినామీ ఆస్తుల కోణంలోనూ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్ వెంకటేష్ సహా భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న మొత్తం 8 మందికి సంబంధించిన ఇళ్లలో సెర్చ్ వారెంట్లతో సోదాలు నిర్వహించి ఆస్తుల పత్రాలు, నగదు, బంగారం, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఏసీబీ దర్యాప్తులో వెలుగుచూసిన వివరాలను పరిశీలించిన ఆదాయపు పన్ను శాఖ కూడా రంగంలోకి దిగి, బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్ కింద ఈ 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బినామీ పేర్లపై ఉన్న ఆస్తులకు అసలు పెట్టుబడులు ఎవరివి, కొనుగోళ్లకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆస్తులను వాస్తవంగా ఎవరు నియంత్రిస్తున్నారు అనే అంశాలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. దర్యాప్తులో బినామీ లావాదేవీలు నిర్ధారణ అయితే సంబంధిత ఆస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బినామీ ఆస్తులు కూడా లెక్కలోకి వస్తే భీమ్‌రెడ్డి కేసులో గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో భీమ్‌రెడ్డి సుమారు 57 రోజుల పాటు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉండి, సెప్టెంబర్ 1న బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే దర్యాప్తు కొనసాగుతుండగా ఏసీబీ, ఐటీతో పాటు ఈడీ కూడా మనీలాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Follow Us