కరోనా కట్టడి భేష్.. తెలంగాణకు కేంద్రం అభినందన

|

Sep 19, 2020 | 5:15 PM

కోవిడ్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రం సంతోషం వ్యక్తం చేసింది. జాతీయ సగటుకన్నా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు తక్కువగా ఉన్నందుకు అభినందించింది. కోవిడ్ నియంత్రణకు చేపడుతున్న..

కరోనా కట్టడి భేష్.. తెలంగాణకు కేంద్రం అభినందన
Follow us on

కోవిడ్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రం సంతోషం వ్యక్తం చేసింది. జాతీయ సగటుకన్నా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు తక్కువగా ఉన్నందుకు అభినందించింది. కోవిడ్ నియంత్రణకు చేపడుతున్న చర్యల పట్ల కూడా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి కితాబిచ్చారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా శనివారం 12 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో, ఆయా రాష్ట్రాలలో కోవిడ్ నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలపై సంయుక్తంగా వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచడంతో పాటు, అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో టెస్టులు నిర్వహించటం పట్ల కేంద్ర కాబినెట్ కార్యదర్శి మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు.