Income Tax Return Filing Deadline Till September 30: ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్న్స్ గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30 వరకు చెల్లించవచ్చునని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
పన్ను చెల్లింపుదారులకు ఇది మరింత సౌలభ్యాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఐటీ రిటర్న్స్ చెల్లింపు చివరి తేదీ జూలై 31 వరకు ఉండగా.. ఇప్పుడు అది కాస్తా రెండు నెలలకు పొడిగించారు. కాగా, 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ చెల్లింపు గడువును ఆదాయపన్ను శాఖ పొడిగించడం ఇది మూడోసారి. ఇదివరకు మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించగా.. ఆ తర్వాత జూలై 31 వరకు.. ఇప్పుడు సెప్టెంబర్‌కు పొడిగించింది.
Also Read: