మహిళపై ఐఏఎస్ అధికారి అఘాయిత్యం..!

|

Jun 04, 2020 | 3:07 PM

ప్రజలకు అండగా ఉండాల్సిన జిల్లా మెజిస్ట్రేటే.. ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ మహిళ భర్తను డిస్మిస్ చేస్తానంటూ బెదిరించి, ఆమెపై కలెక్టరేట్ కార్యాలయంలోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు జిల్లా కలెక్టర్.

మహిళపై ఐఏఎస్ అధికారి అఘాయిత్యం..!
Follow us on

కంచె చేను మేసిందన్న చందంగా మారింది. రక్షణగా ఉండాల్సి వ్యక్తే రాక్షసుడిలా మారాడు. మహిళపై మోజుపడ్డ కామాంధుడు.. భర్త ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని లైంగికదాడికి పాల్పడ్డాడు. ప్రజలకు అండగా ఉండాల్సిన జిల్లా మెజిస్ట్రేటే.. ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఓ మహిళ భర్తను డిస్మిస్ చేస్తానంటూ బెదిరించి, ఆమెపై కలెక్టరేట్ కార్యాలయంలోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు జిల్లా కలెక్టర్. చత్తీస్ ఘడ్ లోని జంగజీర్ చాంఫ్ జిల్లాలో ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. జంగజీర్ చాంఫ్ జిల్లా కలెక్టరుగా పనిచేసిన జనక్ ప్రసాద్ పాథక్ మే 15వతేదీన కలెక్టరు కార్యాలయంలోనే తనపై అత్యాచారం చేశారని 33 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త ఉద్యోగం నుంచి తొలగిస్తానంటూ బెదిరించి తనపై కలెక్టరు అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు కలెక్టరు అశ్లీల సందేశాలు పంపించి, అత్యాచారం చేశాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కలెక్టరుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని జంగజీర్ చాంపా జిల్లా ఎస్పీ పారుల్ మాధూర్ చెప్పారు. మహిళపై అత్యాచారం చేసిన కలెక్టరుపై చత్తీస్ ఘడ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెంటనే జనక్ ప్రసాద్ ను ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టరుగా బదిలీ చేసింది. కీచక కలెక్టరు పాథక్ పై పోలీసులు ఐపీసీ 376, 506, 509 బి కింద కేసులు నమోదు చేశారు.