కరోనా ఎఫెక్ట్: రిమ్స్ డాక్టర్‌పై కేసు నమోదు

| Edited By:

Apr 07, 2020 | 1:58 PM

కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. రిమ్స్ డాక్టర్‌ ఇద్రీస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ ఫిర్యాదు మేరకు ఇద్రీస్‌పై ఐపీసీ 176, 188, 270, 272 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు అయ్యింది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన విషయాన్ని ఇద్రీస్ గోప్యంగా ఉంచారు. కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించిన క్రమంలో.. ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత రెండు […]

కరోనా ఎఫెక్ట్: రిమ్స్ డాక్టర్‌పై కేసు నమోదు
RIMS-Adilabad
Follow us on

కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. రిమ్స్ డాక్టర్‌ ఇద్రీస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ ఫిర్యాదు మేరకు ఇద్రీస్‌పై ఐపీసీ 176, 188, 270, 272 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు అయ్యింది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన విషయాన్ని ఇద్రీస్ గోప్యంగా ఉంచారు.

కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించిన క్రమంలో.. ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత రెండు వారాలపాటు విధులకు ఆయన విధులకు సైతం హాజరయ్యారు. పలువురికి ఆపరేషన్లు కూడా చేయడం గమనార్హం. ఢిల్లీ వెళ్లిన విషయం గుర్తించి ఆయనను వెంటనే ఉన్నతాధికారులు క్వారంటైన్‌కు తరలించారు. కాగా.. డాక్టర్‌ ఇద్రీస్‌కు కరోనా నెగటివ్ రావడంతో వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ ఇద్రీస్ క్వారంటైన్‌లోనే ఉన్నారు.