మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులు కరవు

|

Jan 11, 2020 | 5:09 PM

తెలంగాణలో రెండో పెద్ద పార్టీ తమదేనని చెప్పుకునే కమలనాథులు మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు లేక ఖంగు తింటున్నారు. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ శ్రేణులు దిమ్మతిరిగే సమాచారం ఇవ్వడంతో ఆయన ఆశ్చర్యపోవడంతోపాటు.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం పార్టీ సమీక్షా సమావేశం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బీజేపీ క్లస్టర్ ఇంఛార్జిలపై కిషన్ రెడ్డి తీవ్ర […]

మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులు కరవు
Follow us on

తెలంగాణలో రెండో పెద్ద పార్టీ తమదేనని చెప్పుకునే కమలనాథులు మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు లేక ఖంగు తింటున్నారు. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ శ్రేణులు దిమ్మతిరిగే సమాచారం ఇవ్వడంతో ఆయన ఆశ్చర్యపోవడంతోపాటు.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం పార్టీ సమీక్షా సమావేశం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన బీజేపీ క్లస్టర్ ఇంఛార్జిలపై కిషన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో తమకు పట్టుందని చెప్పుకునే బీజేపీ నేతలు.. ఏకంగా హైదరాబాద్ శివారుల్లోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం లాంటి నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టలేకపోవడం కిషన్ రెడ్డి ఆగ్రహానికి కారణమైనట్లు సమాచారం.

మొత్తమ్మీద తెలంగాణ వ్యాప్తంగా వున్న మునిసిపాలిటీల్లోని 30 శాతం వార్డుల్లో బీజేపీ తరపున నామినేషన్లు వేసే అభ్యర్థులు దొరకలేదని తెలుస్తోంది. అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన కమలనాథులు అభ్యర్థులే దొరకని పరిస్థితి కనిపించడంతో షాక్ అవుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,727 వార్డులుండగా.. 30శాతం స్థానాల్లో బీజేపీకి అభ్యర్థులు దొరకలేదని అంటున్నారు.

దాంతో అభ్యర్థులు దొరకని స్థానాల్లో ఇతర పార్టీల రెబల్స్‌కు బీజేపీ టిక్కెట్ ఇచ్చే అంశంపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. తమను ఆశ్రయించే ఇతర పార్టీల రెబల్స్‌కు వెంటనే టిక్కెట్ ఇవ్వడంతోపాటు ఆర్థిక సాయం కూడా చేసేలా వ్యూహరచన చేస్తోంది కమలదళం.