మోదీ టీంలో కొత్త మంత్రులు వీరే…

ఎంతో ఉత్కంఠ రేపిన కేంద్ర కేబినెట్‌లో మంత్రులకు ఆయా పోర్ట్ ఫోలియోలను కేటాయించారు. ఇందులో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా, నితిన్ గడ్కరీకి రోడ్ ట్రాన్స్ పోర్ట్ హైవే శాఖ కేటాయించారు. ఇక మోదీకి కుడి భుజంగా ఉన్న అమిత్ షాకు హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇక గతంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖలను కేటాయించారు. స్మృతి ఇరానీకి మహిళా శిశు సంక్షేమ శాఖ, […]

మోదీ టీంలో కొత్త మంత్రులు వీరే...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: May 31, 2019 | 4:25 PM

ఎంతో ఉత్కంఠ రేపిన కేంద్ర కేబినెట్‌లో మంత్రులకు ఆయా పోర్ట్ ఫోలియోలను కేటాయించారు. ఇందులో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా, నితిన్ గడ్కరీకి రోడ్ ట్రాన్స్ పోర్ట్ హైవే శాఖ కేటాయించారు. ఇక మోదీకి కుడి భుజంగా ఉన్న అమిత్ షాకు హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇక గతంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖలను కేటాయించారు. స్మృతి ఇరానీకి మహిళా శిశు సంక్షేమ శాఖ, రాం విలాస్ పాశ్వాన్‌కు వినియోగదారుల వ్యవహారాలు, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖలను కేటాయించారు. ప్రహ్లాద్ జోషీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, రవి శంకర్ ప్రసాద్‌కు న్యాయ శాఖలను అప్పగించారు. ఇక సదానంద గౌడ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్, ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం, హర్ష వర్ధన్ – వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ, సుబ్రమణ్యం జయ శంకర్‌కి విదేశీ వ్యవహారాల శాఖ, పీయూష్ గోయల్‌కు రైల్వే శాఖ, ప్రకాష్ జవదేకర్‌కు పర్యావరణం, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.. మైనార్టీ శాఖలను కేటాయించారు. ఇక తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఇంకా ఇతర మంత్రుల శాఖలు ఇలా ఉన్నాయి.

హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ – ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్

తావర్ చంద్ గెహ్లాత్ – సామాజిక న్యాయ శాఖ

రమేష్ పోక్రియాల్ నిశాంక్ – మానవ వనరుల శాఖ

అర్జున్ ముండా – గిరిజన వ్యవహారాల శాఖ

మహేంద్రనాథ్ పాండే – స్కిల్ డెవలప్ మెంట్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ

నరేంద్ర సింగ్ తోమర్ – వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ