“జై శ్రీరాం” స్లోగన్… నిప్పులు కక్కిన దీదీ

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీకి జై శ్రీరాం నినాదాల సెగ పట్టుకుంది. ఆమె ఎక్కడ కనిపిస్తే అక్కడ జై శ్రీరాం అని నినదిస్తూ.. ఆమె ఆగ్రహానికి గునవుతున్నారు బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలు. సార్వత్రిక ఎన్నికల ముందు ఆమె ప్రచారానికి వెళ్తున్న సమయంలో కొందరు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్పట్లో వారిని అరెస్ట్ చేయించింది. దీంతో బెంగాల్ వ్యాప్తంగా మమతకు నిరసన సెగ పట్టుకుంది. ఏకంగా వెస్ట్ బెంగాల్ పర్యటనలో భాగంగా […]

జై శ్రీరాం స్లోగన్... నిప్పులు కక్కిన దీదీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 31, 2019 | 2:15 PM

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీకి జై శ్రీరాం నినాదాల సెగ పట్టుకుంది. ఆమె ఎక్కడ కనిపిస్తే అక్కడ జై శ్రీరాం అని నినదిస్తూ.. ఆమె ఆగ్రహానికి గునవుతున్నారు బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలు. సార్వత్రిక ఎన్నికల ముందు ఆమె ప్రచారానికి వెళ్తున్న సమయంలో కొందరు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్పట్లో వారిని అరెస్ట్ చేయించింది. దీంతో బెంగాల్ వ్యాప్తంగా మమతకు నిరసన సెగ పట్టుకుంది. ఏకంగా వెస్ట్ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, అమిత్ షా కూడా ప్రసంగాలకు ముందు జై శ్రీరాం అంటూ ప్రారంభించిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా గురువారం సాయంత్ర మరో సారి మమతకు పరాభవం ఎదురైంది. కాన్వాయ్‌లో వెళ్తుండగా కొంతమంది ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో సీఎం మమతా బెనర్జీ తన వాహనంలో నుంచి దిగారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తుండటంతో.. వారిని హెచ్చరించారు. నినాదాలు చేస్తున్నవారు బయటివ్యక్తులని, వారంతా బీజేపీ మద్దతుదారులని అన్నారు. కాన్వాయ్‌ను అడ్డుకున్నవారంతా నేరస్థులు, వారు అభ్యంతర పదజాలంతో నన్ను దూషిస్తున్నారని ఆరోపించారు. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.