AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CAA clashes in Delhi: ఢిల్లీలో అదే ఉద్రిక్తత.. హింస.. ఏడుగురి మృతి

ఢిల్లీలో మూడోరోజైన మంగళవారం కూడా హింస కొనసాగింది. ఈశాన్య ఢిల్లీలో ఈ ఉదయం ఆందోళనకారులు పరస్పర ఘర్షణలకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు.

CAA clashes in Delhi: ఢిల్లీలో అదే ఉద్రిక్తత.. హింస.. ఏడుగురి మృతి
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 25, 2020 | 11:33 AM

Share

CAA clashes in Delhi:  ఢిల్లీలో మూడోరోజైన మంగళవారం కూడా హింస కొనసాగింది. ఈశాన్య ఢిల్లీలో ఈ ఉదయం ఆందోళనకారులు పరస్పర ఘర్షణలకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. పలు వాహనాలు, ఇళ్ళు, దుకాణాలకు నిప్పు పెట్టారు. ఆదివారం నుంచే మౌజ్ పురి, జఫ్రాబాద్ తదితర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. నిన్న ఒక పోలీసుతో సహా ఏడుగురు మృతి చెందగా.. ఈ రెండు రోజుల్లో గాయపడినవారి  సంఖ్యవందకు పెరిగింది. వీరిలో 48 మంది పోలీసులు కూడా ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోను, లెఫ్టినెంట్ గవర్నర్ తోను సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించనున్నారు. మరోవైపు కేజ్రీవాల్, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో అత్యవసరంగా భేటీ కానున్నారు. ముఖ్యంగా అల్లర్లు జరిగిన ప్రాంతాల ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. ఓ వైపు యుఎస్ అధ్యక్షుడు  ట్రంప్ భారత పర్యటనకు వఛ్చిన సందర్భంలో దేశ రాజధానిలో ఇలా ఘర్షణలు, అల్లర్లు జరగడం కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇరకాటాన పెడుతోంది.