AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లారీ బస్సు ఢీ.. 11 మంది నేపాలీ వ‌ల‌స కూలీల మృతి.. 22 మందికి గాయాలు

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం. 22 మంది వలస కూలీలు మృతి.. 22 మందికి గాయాలు. భారత్ నుంచి నేపాల్ లోని స్వస్థలాలకు వెళ్తుండగా ఘటన.

లారీ బస్సు ఢీ.. 11 మంది నేపాలీ వ‌ల‌స కూలీల మృతి.. 22 మందికి గాయాలు
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 01, 2020 | 5:35 PM

Share

నేపాల్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడగా, 22 మందికి గాయాలపాలయ్యారు. భారత్ నుంచి నేపాల్ లోని స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. కరోనా లాక్ డౌన్ కార‌ణంగా భార‌త్ లో ఉండిపోయిన నేపాలీ వ‌ల‌స కూలీలు.. మ‌రికొద్ది గంట‌ల్లో ఇంటికి చేరుతార‌న‌గా, వారు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ప‌ద‌కొండు మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 22 మందికి గాయాల‌య్యాయి. నేపాల్ లోని బాంకే జిల్లాలో ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. నేపాల్‌లోని సల్యాన్‌ జిల్లాకు చెందిన కొంతమంది ఉపాధి కోసం భారత్‌లోని ఉత్తరప్రదేశ్ కు వలస వచ్చారు. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ప‌నులు లేక‌పోవ‌డంతో స్వ‌స్థ‌లాల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అధికారుల అనుమతించడంతో ఒక బ‌స్సులో 30 మందికి పైగా వ‌ల‌స కార్మికులు నేపాల్ కు ప‌య‌న‌మ‌య్యారు. అర్ధరాత్రి స‌మ‌యం త‌ర్వాత‌ నేపాల్‌లోని బాంకే జిల్లాలోని ఓ ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ఆ బ‌స్సు ఢీకొట్టింది. బ‌స్సు-లారీలు అతివేగంగా ఢికోవడంతో రెండు వాహ‌నాలు తుక్కుతుక్కుగా అయ్యాయి. ఈ ప్ర‌మాదంలో 11 మంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మ‌రో 22 మందికి గాయాల‌య్యాయి. వారిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. స‌మాచారం అందుకున్న నేపాలీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతుల‌ను, గాయాలపాలైన వారిని నేపాల్ గంజ్ లోని భేరి హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. అతి వేగం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్రాథ‌మిక అంచానా వేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Follow Us
ఈ ఒక్క నియమం చాలు.. లక్ష్మీదేవి మీ ఇంట తిష్టవేసుకుని ఉంటుంది!
ఈ ఒక్క నియమం చాలు.. లక్ష్మీదేవి మీ ఇంట తిష్టవేసుకుని ఉంటుంది!
రెండుసార్లు చేజేతులా మంత్రి పదవిని చేజార్చుకున్న కొండా సురేఖ
రెండుసార్లు చేజేతులా మంత్రి పదవిని చేజార్చుకున్న కొండా సురేఖ
ముంబై కెప్టెన్‎గా సూర్యా భాయ్ ఖరారు
ముంబై కెప్టెన్‎గా సూర్యా భాయ్ ఖరారు
టెక్ ఉద్యోగాల్లో భారీ కోతలు.. 8 నెలల్లో.. 1.23 లక్షల మంది ఔట్!
టెక్ ఉద్యోగాల్లో భారీ కోతలు.. 8 నెలల్లో.. 1.23 లక్షల మంది ఔట్!
ఇంట్లో ఒకే సబ్బు వాడుతున్నారా? ఇది తెలిస్తే వెంటనే ఆపేస్తారు!
ఇంట్లో ఒకే సబ్బు వాడుతున్నారా? ఇది తెలిస్తే వెంటనే ఆపేస్తారు!
రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ కీ మెంబర్స్!
రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ కీ మెంబర్స్!
ఇప్పుడున్న వారిలో అతడిని మించిన నటుడు ఇంకా పుట్టలేదు..
ఇప్పుడున్న వారిలో అతడిని మించిన నటుడు ఇంకా పుట్టలేదు..
‘అచ్యుతం కేశవం' తొలిసారిగా తెలుగులో.. టీవీ9 ఎక్స్‌క్లూజీవ్
‘అచ్యుతం కేశవం' తొలిసారిగా తెలుగులో.. టీవీ9 ఎక్స్‌క్లూజీవ్
చలిలోనూ రాత్రిపూట చెమటలా? ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి!
చలిలోనూ రాత్రిపూట చెమటలా? ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి!
కృష్ణుడి కిరీటంలో నెమలి ఈకకే ఎందుకంత ప్రత్యేకత? అసలు కారణం ఇదే!
కృష్ణుడి కిరీటంలో నెమలి ఈకకే ఎందుకంత ప్రత్యేకత? అసలు కారణం ఇదే!