కాకినాడలో హుండీలు కొల్లగొడుతున్న గ్యాంగ్ అరెెస్ట్

| Edited By: Pardhasaradhi Peri

Oct 04, 2020 | 5:41 PM

వారు అందరిలాంటి దొంగలు కాదు. కేవలం ఆలయాల్లోని దేవుళ్ల హుండీలు మాత్రమే కొల్లగొడతారు. ఆ గ్యాంగ్ సభ్యుల వయస్సు కూడా 18 నుంచి 20 ఏళ్లే.

కాకినాడలో హుండీలు కొల్లగొడుతున్న గ్యాంగ్ అరెెస్ట్
Follow us on

వారు అందరిలాంటి దొంగలు కాదు. కేవలం ఆలయాల్లోని దేవుళ్ల హుండీలు మాత్రమే కొల్లగొడతారు. ఆ గ్యాంగ్ సభ్యుల వయస్సు కూడా 18 నుంచి 20 ఏళ్లే. ఇటీవల కోనసీమలేని అల్లవరం, అమలాపురంలో మూడు దేవాలయ్యాల్లో హుండీలను కొల్లగొట్టి కలకలం రేపారు. దీంతో ఇంద్రపాలెం పోలీసులు రంగంలోకి దిగి, సదరు కిలాడీ ముఠాను అరెస్ట్ చేశారు.  ఇంచార్జి క్రైమ్ డీఎస్పీ భీమారావు ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. (చిక్కిపోయిన కీర్తి, షాకవుతోన్న ఫ్యాన్స్)

కాకినాడ రూరల్ తూరంగి గ్రామానికి చెందిన మైలపల్లి కోదండం(22), జె. రామారావు పేటకు చెందిన కొవ్వూరి దుర్గాప్రసాద్ (19), ఉమ్మడి సతీష్ అలియాస్ పిచ్చుక గాడు (20), తిరుదు నవీన్ కాశీ(20), ముత్తా నగర్ కు చెందిన మైనర్ బాలుడు(18)  ముఠాగా ఏర్పడి కోనసీమలోని అల్లవరం, అమలాపురంలో మూడు దేవాలయాల్లో హుండీలను కొల్లగొట్టారు. అంతేకాదు కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్టేషన్ పరిధిలో రెండు బైక్ లను చోరీ చేశారని డీఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తు రూ. 78,950లు నగదుతో పాటు రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరితగతిన పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ( విజయవాడలో ప్రజల ప్రాణాలతో మటన్ మాఫియా చెలగాటం)