ఆత్మాహుతి దాడిలో ఆప్ఘనిస్థాన్‌ అంఫైర్‌ మృతి

ఆప్ఘనిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంఫైర్‌ బిస్మిల్లా జాన్ షిన్వారి కన్నుమూశారు. స్థానిక మీడియా కథనం ప్రకారం

ఆత్మాహుతి దాడిలో ఆప్ఘనిస్థాన్‌ అంఫైర్‌ మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 04, 2020 | 5:10 PM

Afghanistan Umpire death: ఆప్ఘనిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంఫైర్‌ బిస్మిల్లా జాన్ షిన్వారి కన్నుమూశారు. స్థానిక మీడియా కథనం ప్రకారం నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని ఘనిఖిల్‌ జిల్లా గవర్నర్ ఇంటి వద్ద శనివారం పేలుడు సంభవించింది. దుండగులు కారు బాంబు ద్వారా దాడికి పాల్పడ్డారు. ఇందులో 15 మంది మృతి చెందగా.. మరో 30 మందికి గాయాలయ్యాయి. మరణించిన వారిలో బిస్మిల్లా కూడా ఉన్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. అయితే షిన్వాని పలు అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ మ్యాచ్‌లకు అంఫైర్‌గా వ్యవహరించారు.

Read More:

‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌ కోసం రాజమౌళి స్పెషల్ అరేంజ్‌మెంట్స్‌..!

మరోసారి దాతృత్వం చాటుకున్న ప్రకాష్‌ రాజ్