IPL 2020: ఢిల్లీ ఫస్ట్.. చెన్నై లాస్ట్

ఐపీఎల్ 2020లో ప్రేక్షకులు చూడకూడదని సిత్రాలు చూస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది పేలవమైన ఫామ్‌తో కొనసాగుతోంది.

IPL 2020: ఢిల్లీ ఫస్ట్.. చెన్నై లాస్ట్
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 04, 2020 | 2:42 PM

ఐపీఎల్ 2020లో ప్రేక్షకులు చూడకూడదని సిత్రాలు చూస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది పేలవమైన ఫామ్‌తో కొనసాగుతోంది. అన్ని జట్లూ నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకునేసరికి చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా… అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానానికి చేరుకుంది. ఇక అందరిని ఆశ్చర్యపరుస్తూ కోహ్లీసేన రెండోస్థానంలో ఉండటం విశేషం. (IPL 2020)

ప్రస్తుతానికి ఢిల్లీ, బెంగళూరు చెరో మూడు మ్యాచ్‌లు గెలవగా.. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, రాజస్తాన్.. చెరో రెండు, పంజాబ్, చెన్నై కేవలం ఒక్క మ్యాచ్ గెలిచి చివరి స్థానాల్లో ఉన్నాయి. టోర్నీలో ఇంకా ప్రతీ జట్టు 10 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఏ సమయానికి టేబుల్ తలక్రిందులు అవుతుందో చెప్పలేం అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫామ్ లేమితో చెన్నై సతమతమవుతున్నా.. ఆ జట్టును తక్కువ అంచనా వేయకూడదని.. ధోని తిరిగి ఫామ్ అందుకుంటే.. సీఎస్‌కే విజయాల పరంపర కొనసాగిస్తుందని చెబుతున్నారు.