GHMC News: పారిశుధ్య కార్మికులకు బంపర్ ఆఫర్.. దీపావళి నాడు వెల్లడించిన కేటీఆర్.. ఆరేళ్ళలో రెట్టింపు స్థాయికి..

|

Nov 14, 2020 | 3:50 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పారిశుద్య కార్మికులకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ దీపావళి సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌తో పారిశుద్య కార్మికుల...

GHMC News: పారిశుధ్య కార్మికులకు బంపర్ ఆఫర్.. దీపావళి నాడు వెల్లడించిన కేటీఆర్.. ఆరేళ్ళలో రెట్టింపు స్థాయికి..
Follow us on

Bumper offer to GHMC workers: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పారిశుద్య కార్మికులకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ దీపావళి సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌తో పారిశుద్య కార్మికుల జీతాలు గత ఆరేళ్ళలో రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. దీపావళి నాడు మంత్రి కేటీఆర్ ప్రకటించిన గుడ్ న్యూస్‌తో జీహెచ్ఎంసీ పారిశుద్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 8,500 వేతనాలుండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే వారి వేతనాలను 12,500 రూపాయలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత 2017లో దానిని రూ.14,500కు పెంచగా.. తాజాగా దీపావళి నాడు సమీక్ష జరిపిన పురపాలక పరిపాలనా శాఖా మంత్రి కే.తారక రామారావు వారి వేతనాల్లో 3 వేల రూపాయల పెంపును ప్రకటించారు. దాంతో 14,500 రూపాయలుగా వున్న వారి వేతనం 17,500 రూపాయలకు పెరిగినట్లయ్యింది.

కార్మికుల్లో హర్షాతిరేకం

జీతాలు పెంచుతూ కేటీఆర్ ప్రకటన చేయడంపై జీహెచ్ఎంసీ సానిటేషన్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్మికుల పట్ల ఇంత పక్షపాతంగా ఉన్న కేసీఆర్‌కు ఋణపడి ఉంటామని కార్మికులు ప్రతినబూనారు.

ALSO READ: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ గ్రేట్ న్యూస్… 50% శాతం రాయితీ

ALSO READ: దిగ్దర్శకుడు విశ్వనాథ్‌తో చిరంజీవి భేటీ

హామీ ఇచ్చిన ప్రకారం జీతాలు పెంచిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. తాజా నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధిలోని 18 వేల 540 మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు సార్లు జీతాలు పెంచారని, 2014లో 8,500 రూపాయలుగా వున్న వేతనం తాజా నిర్ణయంతో 17 వేల 500 రూపాయలకు చేరిందని వారు తెలిపారు. కరోనా సమయంలో కష్టపడిన కార్మికుల శ్రమను ముఖ్యమంత్రి గుర్తించారంటూ వారు హర్షం వ్యక్తం చేశారు.