ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కోర్సులకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) 2021-22 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మరోసారి విద్యా కాలపట్టికను సవరించింది. ఈసారి క్లాసుల ప్రారంభానికి తుది గడువును మరింత పెంచింది. మే నెల ఫస్ట్ వీక్‌లో ఏఐసీటీఈ తొలి విద్యా కాలపట్టికను రిలీజ్ చేసింది. దాని ప్రకారం సెప్టెంబరు 1వ తేదీలోపు ఇప్పటికే చదువుతున్న వారికి, 15లోపు కొత్తగా మొదటి సంవత్సరం జాయిన్ అయ్యేవారికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లేదా రెండింటి ద్వారా క్లాసెస్ ప్రారంభించాలని పేర్కొంది. తాజాగా సవరించిన కాలపట్టిక ప్రకారం పాత స్టూడెంట్స్‌కు అక్టోబరు 1వ తేదీ, కొత్తవారికి అక్టోబరు 25లోపు తరగతులను ప్రారంభించుకోవచ్చని నిర్దేశించింది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఎంట్రన్స్ కౌన్సెలింగ్ సెప్టెంబరు వరకు పూర్తవుతుంది. అంతకంటే ముందు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ పూర్తి చేస్తే స్టూడెంట్స్‌కు సమస్య అవుతుందని, రాష్ట్ర కాలేజీల్లో చేరి మళ్లీ ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్లు వచ్చాయంటూ వెళతారని, దానివల్ల గందరగోళం తలెత్తుతుందని ప్రేవేట్ కళాశాలలు ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్ర కళాశాలల్లో సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతాయన్న సందేహాన్ని ప్రవేట్ కాలేజీల యాజమాన్యాలు వెల్లిబుచ్చాయి. దీనిపై ఫిర్యాదులు అందటంతో తరగతుల ప్రారంభానికి గడువును ఏఐసీటీఈ పెంచినట్లు భావిస్తున్నారు.
Also Read: హై సెక్యూరిటీ ఉన్నా.. కొత్త రూ.500 నోట్లు మాయం.. నాసిక్ ప్రెస్‌లో కలకలం..