AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ ఎలక్షన్ యాడ్స్‌తో బోయపాటి సంపాదన..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు రాజకీయ ప్రచారంలో ఓటర్లందరిపై వరాల జల్లు కురిపించారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే అధికార తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. దానితో ఇరు పార్టీలూ కూడా నువ్వా నేనా అన్నట్లు ప్రచారం జోరుగా చేశాయి. మరోవైపు ఈ రెండు పార్టీలూ వాణిజ్య ప్రకటనలు కూడా ఓ రేంజులో చేశాయి. వాటి కోసం భారీగా ఖర్చు […]

టీడీపీ ఎలక్షన్ యాడ్స్‌తో బోయపాటి సంపాదన..?
Ravi Kiran
|

Updated on: Apr 10, 2019 | 8:23 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు రాజకీయ ప్రచారంలో ఓటర్లందరిపై వరాల జల్లు కురిపించారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే అధికార తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. దానితో ఇరు పార్టీలూ కూడా నువ్వా నేనా అన్నట్లు ప్రచారం జోరుగా చేశాయి.

మరోవైపు ఈ రెండు పార్టీలూ వాణిజ్య ప్రకటనలు కూడా ఓ రేంజులో చేశాయి. వాటి కోసం భారీగా ఖర్చు చేశాయి. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన ప్రకటనలు సెంటిమెంట్ తో రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలు అన్నీ బుల్లితెరపై జోరుగా ప్రసారం అయ్యాయి.

ఇక ఈ టీడీపీకి సంబంధించిన యాడ్స్ అన్ని కూడా దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 10 యాడ్స్ లో తనదైన మార్క్ ఎమోషన్ తో జనాలను కనెక్ట్ అయ్యేలా చేశారు బోయపాటి. అయితే ఈ యాడ్స్ కు గానూ ఆయన దాదాపు 4 నుండి 5 కోట్లు మధ్య డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఇక ఆయన చేసిన యాడ్స్ వల్ల టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.