
తిరుపతిలోని ఆస్పత్రి వద్ద బాంబు పేలుడు జరిగింది. నాటుబాంబులు పెట్టి ఉన్న కవర్ కుక్కలు లాక్కెళ్లడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఒక ఆటోలో తీసుకెళ్తున్న బాంబులను కుక్కలు నోటితో పట్టి లాక్కెళ్లినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన తిరుపతిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణ నష్టం లేకపోవడంతో పట్టణ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అడవి పందుల కోసం నాటుబాంబులు తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.