ముంబైలో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు..

| Edited By:

Jun 07, 2020 | 12:23 PM

ముంబైలో గ్యాస్ లీకేజి ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి. చెంబూరు, ఘట్కోపర్, కంజుమర్గ్, విక్రోలీ, పావోయి ప్రాంతాల్లో గాఢమైన వాసన రావడంతో గ్యాస్ లీక్ అయినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

ముంబైలో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు..
Follow us on

ముంబైలో గ్యాస్ లీకేజి ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి. చెంబూరు, ఘట్కోపర్, కంజుమర్గ్, విక్రోలీ, పావోయి ప్రాంతాల్లో గాఢమైన వాసన రావడంతో గ్యాస్ లీక్ అయినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో అధికారులు 17 ఫైరింజన్లను సిద్ధం చేశారు. పరిస్థితి అదుపులో ఉందని, ఎవరూ భయాందోళనలకు గురి కావద్దని ముంబై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఎవరైనా వాసనతో ఇబ్బంది పడితే తడిచిన బట్టతో ముక్కును కప్పి ఉంచాలని సూచించారు. గోవాండి (తూర్పు) లోని యుఎస్ విటమిన్ కంపెనీలో గ్యాస్ లీకేజ్ జరిగినట్లు తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మా దర్యాప్తు కొనసాగుతోందని ముంబై అగ్నిమాపక దళానికి చెందిన అధికారి తెలిపారు.

[svt-event date=”07/06/2020,12:10PM” class=”svt-cd-green” ]

Also Read: విద్యుత్ బిల్లు.. వాయిదాల్లో కట్టొచ్చు.. కానీ..