మహబూబ్ నగర్‌లో క్షుద్రపూజల కలకలం..

మహబూబ్ నగర్ జడ్చర్లలో క్షుద్రపూజలు కలకలం స‌ృష్టించాయి. జడ్చర్ల శివారులోని శివగిరిక్షేత్రంలో క్షుద్రపూజలు చేశారు నలుగురు వ్యక్తులు. అర్థరాత్రి కాళికామాత విగ్రహం దగ్గర.. నగ్నంగా క్షుద్రపూజలు నిర్వహించారు నలుగురు వ్యక్తులు. ఈ పూజలు మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ కొనసాగాయి. పెద్దఎత్తున మంటలు ఎగసిపడడంతో గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వెంటనే నగ్నంగా క్షుద్రపూజలు చేస్తున్నవారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. కాగా.. నిందితులు హైదరాబాద్‌కు చెందిన.. కమల్, భరత్, సురేష్, రాజులుగా గుర్తించారు. ఏం […]

మహబూబ్ నగర్‌లో క్షుద్రపూజల కలకలం..

Edited By:

Updated on: Apr 02, 2019 | 2:11 PM

మహబూబ్ నగర్ జడ్చర్లలో క్షుద్రపూజలు కలకలం స‌ృష్టించాయి. జడ్చర్ల శివారులోని శివగిరిక్షేత్రంలో క్షుద్రపూజలు చేశారు నలుగురు వ్యక్తులు. అర్థరాత్రి కాళికామాత విగ్రహం దగ్గర.. నగ్నంగా క్షుద్రపూజలు నిర్వహించారు నలుగురు వ్యక్తులు. ఈ పూజలు మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ కొనసాగాయి. పెద్దఎత్తున మంటలు ఎగసిపడడంతో గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వెంటనే నగ్నంగా క్షుద్రపూజలు చేస్తున్నవారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. కాగా.. నిందితులు హైదరాబాద్‌కు చెందిన.. కమల్, భరత్, సురేష్, రాజులుగా గుర్తించారు. ఏం ఆశించి ఈ పూజలు చేశారో.. ఇన్వెస్ట్‌గేషన్ చేస్తున్నారు పోలీసులు.