రాహుల్‌పై సుప్రీం కోర్టుకు మీనాక్షి లేఖి
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. రఫేల్ వివాదంపై ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ వక్రీకరించారని ఆమె పేర్కొన్నారు. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈ మేరకు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. లేఖీ తరపున కోర్టులో వాదనలు వినిపించారు. ‘‘సుప్రీం కోర్టు కూడా చౌకీదార్ ఛోర్ […]

ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. రఫేల్ వివాదంపై ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ వక్రీకరించారని ఆమె పేర్కొన్నారు. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈ మేరకు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. లేఖీ తరపున కోర్టులో వాదనలు వినిపించారు. ‘‘సుప్రీం కోర్టు కూడా చౌకీదార్ ఛోర్ హై అని తేల్చింది’’ అని రాహుల్ వ్యాఖ్యానించినట్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. లేఖి అభ్యర్థనపై ఏప్రిల్ 15న విచారణ జరుపుతామని తెలిపింది.




