బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి.. టీఎంసీ పనేనంటున్న కమల దళం

| Edited By:

May 12, 2019 | 8:13 AM

పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లో శనివారం రాత్రి బీజేపీకి చెందిన ఓ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే ఇది అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పనే అని బీజేపీ ఆరోపించింది. బీజేపీ కార్యకర్త మృతితో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఈస్ట్ మిడ్నాపూర్‌లోని భగబన్‌పూర్‌లో అనంత గుచైటీ, రంజిత్ మైటీ అనే ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై రాత్రి కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడ్డ వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.అయితే బీజేపీ చేసిన ఆరోపణలను తృణముల్ […]

బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి.. టీఎంసీ పనేనంటున్న కమల దళం
Follow us on

పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లో శనివారం రాత్రి బీజేపీకి చెందిన ఓ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే ఇది అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పనే అని బీజేపీ ఆరోపించింది. బీజేపీ కార్యకర్త మృతితో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఈస్ట్ మిడ్నాపూర్‌లోని భగబన్‌పూర్‌లో అనంత గుచైటీ, రంజిత్ మైటీ అనే ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై రాత్రి కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడ్డ వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.అయితే బీజేపీ చేసిన ఆరోపణలను తృణముల్ కొట్టిపారేసింది.

సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్‌లో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని 8 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో జార్‌గ్రామ్ లోక్‌సభ నియోజకవర్గం కూడా ఒకటి. గడిచిన ఐదు దశల ఎన్నికల్లో సైతం తృణమూల్, బీజేపీల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి బూత్‌ వద్ద 8మంది భద్రతా సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశారు.