బీజేపీ షాకింగ్ డిసిషన్.. 40 మంది పార్టీ నాయకులపై వేటు
బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. నలభై మంది పార్టీ నాయకులపై వేటు వేస్తూ.. సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో 40 మంది బీజేపీ నాయకులు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు నామినేషన్లు సమర్పించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మొత్తం నలభై మందిపై.. ఆరేళ్లపాటు బీజేపీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ […]

బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. నలభై మంది పార్టీ నాయకులపై వేటు వేస్తూ.. సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో 40 మంది బీజేపీ నాయకులు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు నామినేషన్లు సమర్పించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మొత్తం నలభై మందిపై.. ఆరేళ్లపాటు బీజేపీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు సస్పెన్షన్ కు గురైన నేతల స్థానంలో.. ఆ పదవుల్లో కొత్త వారిని నియమిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర భండారీ చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అక్టోబరు 6 నుంచి 16వతేదీ వరకు మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే సస్పెన్షన్‌కు గురైన వారిలో జిల్లా స్థాయి బీజేపీ నాయకులున్నారు. పార్టీలో ఇంతమందిని ఒకేసారి సస్పెన్షన్ విధించడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.



