విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

| Edited By:

Aug 23, 2019 | 2:56 PM

తెలంగాణలో సోలార్ విద్యుదుత్పత్తిని ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని , సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే అన్ని నిజాలు వెల్లడవుతాయన్నారు . హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ చర్యలతో దేశంలోని 28 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ సాధ్యమైందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ దక్షిణ, ఉత్తర విద్యుత్ గ్రిడ్లను అనుసంధానం చేయడం ద్వారానే ప్రస్తుతం రాష్ట్రానికి తక్కువ ధరకు […]

విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
Follow us on

తెలంగాణలో సోలార్ విద్యుదుత్పత్తిని ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని , సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే అన్ని నిజాలు వెల్లడవుతాయన్నారు .

హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ చర్యలతో దేశంలోని 28 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ సాధ్యమైందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ దక్షిణ, ఉత్తర విద్యుత్ గ్రిడ్లను అనుసంధానం చేయడం ద్వారానే ప్రస్తుతం రాష్ట్రానికి తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుందన్నారు లక్ష్మణ్. 70 ఏళ్లలో ఎవ్వరూ చేయని విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ మారుమూల గ్రామాలకు సైతం విద్యుత్ అందించారన్నారు. అయితే ఇదంతా కేసీఆర్ ఘనతగా చెప్పుకోవడం సరికాదన్నారు.

ఐదేళ్ల పాలనలో విద్యుత్‌ రంగానికి సంబంధించి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదని.. ఒక్క మెగావాట్‌ అదనంగా ఉత్పత్తి చేయలేదని లక్ష్మణ్‌ విమర్శించారు. జాతీయ సోలార్‌ విధానంలో భాగంగా చౌకగా రూ. 4.30పైసలకు సోలార్ ఇస్తానంటే రాత్రికి రాత్రే రూ.5.50పైసలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని లక్ష్మణ్‌ ఆరోపించారు