అసలైన భారతీయుల పేర్లు లేవు : అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్
దేశంలో చర్చనీయాంశంగా మారిన అసోం ఎన్ఆర్‌సీ నివేదకపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పెదవి విరిచారు. శనివారం అసోం ప్రభుత్వం నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ చార్ట్ విడుదల చేసింది. అయితే ఈ జాబితా నుంచి ఎంతో మంది భారతీయుల పేర్లు తప్పించబడ్డాయని విమర్శించారు. ఈ జాబితా నుంచి అసలైన భారతీయుల పేర్లు లేకపోడానికి అధికారుల నిర్లక్ష్యం కారణమన్నారు. ముఖ్యంగా బెంగాలీ హిందువులు ఎన్ఆర్‌సీ జాబితా నుంచి తప్పించబడ్డారని ఆరోపించారు. అసోం గణన 1985 […]
దేశంలో చర్చనీయాంశంగా మారిన అసోం ఎన్ఆర్‌సీ నివేదకపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పెదవి విరిచారు. శనివారం అసోం ప్రభుత్వం నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ చార్ట్ విడుదల చేసింది. అయితే ఈ జాబితా నుంచి ఎంతో మంది భారతీయుల పేర్లు తప్పించబడ్డాయని విమర్శించారు. ఈ జాబితా నుంచి అసలైన భారతీయుల పేర్లు లేకపోడానికి అధికారుల నిర్లక్ష్యం కారణమన్నారు. ముఖ్యంగా బెంగాలీ హిందువులు ఎన్ఆర్‌సీ జాబితా నుంచి తప్పించబడ్డారని ఆరోపించారు. అసోం గణన 1985 ప్రామాణికంగా జాబితాను రూపొందించాలని గొగోయ్ అసోం ప్రభుత్వానికి సూచించారు. జాబితా తయారు చేయడలో హిందూ, ముస్లిం అనే అంశం ప్రధానమైంది కాదని, అయితే విదేశీయులెవరూ ఈ జాబితాలో ఉండకూడదన్నారు. ఎన్ఆర్‌సీ జాబితా తయారీలో జరిగిన తప్పులకు కారణం ఏమిటో బీజేపీ ప్రభుత్వం చెప్పాలని ఈ మాజీ ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.